30 May, 2026 | 2:47 AM

ఈసెట్ ఫలితాలు విడుదల

30-05-2026 12:41 AM
  1.   93.60 శాతం మంది ఉత్తీర్ణత
  2. జూన్ మొదటి వారంలో కౌన్సెలింగ్ షెడ్యూల్
  3. ఫలితాలను విడుదల చేసిన ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి

హైదరాబాద్, మే 29 (విజయక్రాంతి): తెలంగాణ ఈసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ (మ్యాథ్స్) పూర్తి చేసిన విద్యార్థులకు ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ ద్వారా నేరుగా సెకండియర్ ప్రవేశాల కోసం నిర్వహించే ఈ పరీక్షలో మొత్తం 16,726 (93.60 శాతం) మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు.

మాసాబ్ ట్యాంక్‌లోని ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో శుక్రవారం ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలక్రిష్ణరెడ్డి, వైస్ చైర్మన్ పురుషోత్తం, మహమూద్, కార్యదర్శి శ్రీరామ్ వెంకటేష్, ఉస్మానియా వర్సిటీ వీసీ మొలుగారం కుమార్, ఈసెట్ కన్వీనర్ పి.చంద్రశేఖర్‌తో కలిసి ఫలితాలను విడుదల చేశారు. ఈసెట్‌లో మొత్తం  అభ్యర్థులు 18,626 మంది దరఖాస్తు చేసుకోగా, అందులో 17,870 మంది పరీక్షలకు హాజరయ్యారు.

వీరిలో మొత్తం పదకొండు స్ట్రీమ్‌లలో కలిపి 16,726 మంది ఉత్తీర్ణత సాధిం చారు. కెమికల్ ఇంజినీరింగ్ స్ట్రీమ్‌లో తొలి ర్యాంక్‌ను ఆర్ నరేంద్ర, రెండో ర్యాంక్‌ను బి.ప్రతిభ శ్రీ సాధించగా, సివిల్ ఇంజినీరింగ్‌లో కే.సంతోష్ ఫస్ట్ ర్యాంక్‌ను, అమిత్ ప్యాట్రో సెకండ్ ర్యాంక్‌ను సాధించా రు. మిగిలిన స్ట్రీమ్‌లోని ర్యాంకర్ల వివరాలను కూడా అధికారులు ప్రకటించడంతోపాటు, వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. 

జూలై మొదటి వారంలో తరగతులు: బాలకిష్టారెడ్డి

జూలై మొదటి వారంలో తరగతులు ప్రారంభిస్తామనని చైర్మన్ బాలకిష్టారెడ్డి తెలిపారు. మొత్తం 179 కాలేజీలు ఉండ గా అందులో 21,200 సీట్లున్నాయని, అందులో గత సంవత్సరం 19,899 భర్తీ అయ్యాయన్నారు. కౌన్సెలింగ్ షెడ్యూ ల్‌ను జూన్ మొదటి వారంలో విడుదల చేస్తామన్నారు. ఫీజు లు చెల్లింపు గత ఏడాది తరహాలోనే అమలు చేస్తామని చెప్పా రు. విద్యార్థులకు కట్టాల్సిన అవసరంలేదన్నారు. ఉస్మానియా వర్సిటీలో ఈవ్‌నింగ్ క్లాసులకు సంబంధించిన షెడ్యూల్‌ను వారం రోజుల్లో వస్తుందని వర్సిటీ వీసీ కుమార్ తెలిపారు.