11 April, 2026 | 11:59 AM

Breaking News

పోటు రంగారావుపై NIA ఉపా చట్టం కేసు ఎత్తివేయాలి ‌‌   •   మంగళ్‌హాట్‌లో కార్డెన్ సెర్చ్— గ్యాస్ సిలిండర్లు, బైకులు స్వాధీనం   •   ముంబైలో ఘోర అగ్నిప్రమాదం— సిలిండర్ పేలుళ్లతో తీవ్ర భయాందోళన   •   కర్ణాటకలో యూత్ కాంగ్రెస్‌ నేత దారుణహత్య.. స్థానికుల్లో భయాందోళన!   •   జ్యోతిరావు పూలే జయంతి.. నివాళులర్పించిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ   •   కోదాడ జాతీయ రహదారిపై ఘోర బస్సుప్రమాదం... స్పాట్‌లో 36 మంది..!   •   బిక్కనూర్ వద్ద ఘోర రోడ్డుప్రమాదం – ఇద్దరు మృతి   •   ఐలాపూర్‌లో హైడ్రా కూల్చివేతలు   •   అమీన్‌పూర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్‌... హైకోర్టు లాయర్‌ ఫామ్‌హౌస్‌ కూల్చివేత   •   జీవితంపై విరక్తి చెంది ఇద్దరు యువకుల ఇద్దరు ఆత్మహత్య   •  

అఖండ జ్యోతి యాత్రకు ఘన స్వాగతం

16-02-2026 09:17 PM

ఘట్ కేసర్,(విజయక్రాంతి): యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి వారి 32వ అఖండజ్యోతి యాత్ర సోమవారం రాత్రి ఘట్ కేసర్ పట్టణానికి చేరుకుంది. మహాశివరాత్రి పర్వదినాన నగరంలోని యాదగిరి భవన్ నుంచి ప్రారంభమైన శ్రీలక్ష్మీనర్సింహస్వామి అఖండ జ్యోతి యాత్ర ఘట్ కేసర్ చేరుకోవటంతో స్థానిక నాయకులు, భక్తులు ఘనంగా స్వాగతం పలికారు. 12 అడుగుల ఎత్తుతో శ్రీస్వామి వారు అమ్మవారల ప్రతిమలతో దేదీప్యమానమైన దీపకాంతులతో సుర్వాంగ సుందరంగా ఆలంకరింపబడిన దివ్య పుష్పరథంపై వచ్చిన స్వామి వారికి ఘనంగా పూజలు జరిపారు.

ఈ కార్యక్రమంలో మారం లక్ష్మారెడ్డి, పాటి మహిపాల్ రెడ్డి, రేసు లక్మా రెడ్డి, చందుపట్ల వెంకటరెడ్డి, కొమ్మిడి బ్రదర్స్ మహిపాల్ రెడ్డి, జైపాల్ రెడ్డి, బచ్చు నాగేష్ గుప్తా, బద్దం కృష్ణారెడ్డి, దీకొండ రఘు, చందుపట్ల లక్ష్మారెడ్డి, గడీల సంజీవరెడ్డి రామచంద్రారెడ్డి ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.