12-11-2025 06:47:40 PM
స్వాగతం పలికిన ఇంచార్జ్ ఆర్డీవో కృష్ణయ్య, తహసిల్దార్ వెంకన్న
మోతె: రాష్ట్ర సమాచార, రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా సూర్యాపేట - ఖమ్మం జిల్లా సరిహద్దు అయిన మోతె మండల పరిధిలోని మామిళ్ళగూడెం(సింగరేణిపల్లి) టోల్ ప్లాజా వద్దకు హెలికాప్టర్ ద్వారా లాండింగ్ కావడంతో సూర్యాపేట ఇంచార్జ్ ఆర్డీవో కృష్ణయ్య, మోతే ఎమ్మార్వో వెంకన్న, రెవెన్యూ ఇన్స్పెక్టర్ కరుణాకర్ రెడ్డిలు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గంలో ఖమ్మం జిల్లా పర్యటన చేపట్టారు.