calender_icon.png 12 November, 2025 | 8:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనాధ పిల్లలకు ఆరోగ్య పరీక్షలు

12-11-2025 06:44:16 PM

కార్పొరేటర్ మీనా ఉపేందర్ రెడ్డి ముందడుగు..

మల్కాజ్గిరి (విజయక్రాంతి): మల్కాజ్గిరి నియోజకవర్గం నేరెడ్ మెట్ డివిజన్ పరిధిలోని మాత్రపురి కాలనీలోని అనాధ పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. మల్కాజ్గిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో జరిగిన ఈ వైద్య శిబిరానికి స్థానిక కార్పొరేటర్ కొత్తపల్లి మీనా ఉపేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనాధ పిల్లలకు సాధారణ ఆరోగ్య పరీక్షలు, రక్తపోటు, హీమోగ్లోబిన్, బరువు, కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ మీనా ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ సమాజంలోని బలహీన వర్గాల ఆరోగ్య రక్షణకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రతి ఒక్కరు విజయవంతం చేయాలి. అనాధ పిల్లలు ఆరోగ్యంగా ఎదగడం మనందరి బాధ్యత అని అన్నారు. వైద్య పరీక్షల అనంతరం పిల్లలకు పండ్లు, పోషకాహారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఉపేందర్ రెడ్డి, శర్మ, ఇతర నాయకులు, డాక్టర్లు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.