calender_icon.png 12 November, 2025 | 8:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళలు, విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యం

12-11-2025 06:50:33 PM

త్రీ టౌన్ ఇన్‌స్పెక్టర్ విద్యాసాగర్..

సిద్దిపేట క్రైమ్: మహిళలు, విద్యార్థినుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు సిద్దిపేట త్రీ టౌన్ ఇన్‌స్పెక్టర్ విద్యాసాగర్ చెప్పారు. బుధవారం స్థానిక శ్రీ వాణి హైస్కూల్‌లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈవ్ టీజింగ్, సైబర్ నేరాలు, మానవ అక్రమ రవాణా, గుడ్ టచ్ – బ్యాడ్ టచ్, ట్రాఫిక్ నియమాలు, టీ సేఫ్ యాప్, షీ టీం గురించి వివరించారు. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే డయల్ 100 లేదా షీ టీమ్ నంబర్‌ 8712667434 కు ఫోన్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట ట్రాఫిక్ ఎస్ఐ విద్యాబాస్కర్, షీ టీం ఏఎస్ఐ కిషన్ పవార్, మహిళా కానిస్టేబుళ్లు రజిని, మమత, కానిస్టేబుళ్లు ప్రవీణ్, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.