calender_icon.png 1 August, 2025 | 12:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరుపేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

31-07-2025 02:52:24 PM

కాంగ్రెస్ పార్టీ మండల ఇంచార్జ్ జీవన్ కుమార్ - 

మందమర్రి,(విజయక్రాంతి): నిరుపేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని, వారి సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం(State Government) చిత్తశుద్ధితో కృషి చేస్తుందని మండల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కడారి జీవన్ కుమార్ స్పష్టం ఆ చేశారు. మండలంలోని అందుగులపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో గురువారం లబ్ధిదారులకు మంజూరైన నూతన రేషన్ కార్డులను(New ration cards)  పంపిణీ చేసి మాట్లాడారు.

త బిఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవ త్సరాల పాలనలో రేషన్ కార్డులు మంజూరు చేసిన దాఖలాలు లేవని విమర్శించారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం నిరుపేదల సంక్షేమానికి, అభివృద్ధికి కృషి చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ ప్రకారం రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమం చేపట్టింద ని తద్వార బడుగు బలహీన లో వర్గాల ప్రజలకు ప్రయోజ నం చేకూరుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన 6 గ్యారంటీలు, హామీల అమలుకు అమలుకు కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం లో గ్రామ కార్యదర్శి వీరేందర్, కాంగ్రెస్ నాయకులు బైరినేని లక్ష్మణ్, రేషన్ డీలర్ వెంకట రెడ్డి లబ్ధిదారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.