calender_icon.png 1 August, 2025 | 1:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీపీఎం ఆధ్వర్యంలో కమిషనర్ కు వినతి

31-07-2025 05:17:41 PM

కాగజ్ నగర్,(విజయక్రాంతి): కాగజ్ నగర్ పురపాలకలో రహదారులు, మురుగు కాల్వల నిర్మాణం చేపట్టాలని సిపిఎం ఆధ్వర్యంలో గురువారం మున్సిపల్ కమిషనర్ రాజేందర్ కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు ఆనంద్, ముంజం శ్రీనివాస్ మాట్లాడుతూ... 1952లో ఏర్పడిన కాగజ్ నగర్ మున్సిపాలిటీ పాలకులు, అధికారుల నిర్లక్ష్యం వల్ల అభివృద్ధికి నోచుకోలేదు.

దీనికి ప్రధాన కారణం మాస్టర్ ప్లాన్ లేకపోవడమే నన్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రహదారులు విస్తరించకపోవడం, మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనలకే పరిమితమైందన్నారు. మున్సిపాలిటీలో మురుగు కాలువలు, ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణల ను అరికట్టడంలో అధికారులు విఫలమైనట్లు ఆరోపించారు. పట్టణంలో వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉంది. సత్వరమే చర్యలు తీసుకోవాలని అవినీతిపత్రంలో కోరారు.