calender_icon.png 2 August, 2025 | 5:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మొక్కలు నాటి సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిది

01-08-2025 11:35:03 AM

తుంగతుర్తి లైన్స్ క్లబ్ ఉపాధ్యక్షులు తల్లాడ కేదారి

తుంగతుర్తి( విజయక్రాంతి): సమాజంలో స్వచ్ఛందంగా మొక్కలు నాటి సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని తుంగతుర్తి లైన్స్ క్లబ్ ఉపాధ్యక్షులు తల్లాడ కేదారి అన్నారు శుక్రవారం మండల కేంద్రంలోని శ్రీ పట్టాభి సీతా రామచంద్రస్వామి ఆలయంలో లైన్స్ క్లబ్ సభ్యుల ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సమాజంలో పేదలకు సేవ చేయాలనే లక్ష్యమే లైన్స్ క్లబ్ ఉద్దేశమని అన్నారు. ప్రతి ఒక్కరు పేదలకు తమకు తోచిన విధంగా సహాయ సహకారాలు అందించాలని కోరారు. అనంతరం రామాలయ పూజారి కాటూరి రామాచార్యులు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ కోశాధికారి గుండ గాని రాము, లైన్స్ క్లబ్ ప్రోగ్రాం కోఆర్డినేటర్లు ఓరుగంటి శ్రీనివాస్, ఓరుగంటి సుభాష్ ఎనగందుల గిరి, రామాలయ చైర్మన్ ఎనగందుల సంజీవ, గుడిపూడి లక్ష్మణరావు పులుసు వెంకటనారాయణ గౌడ్, తల్లాడ పద్మ, సూర్య కళ  ,రాణి, విజయ, తదితరులు పాల్గొన్నారు.