calender_icon.png 2 August, 2025 | 5:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాలిటెక్నిక్‌ కళాశాలలో స్పాట్‌ అడ్మిషన్లకు దరఖాస్తుల ఆహ్వానం: ప్రిన్సిపల్‌ ఐలయ్య

01-08-2025 12:02:11 PM

  • పేద విద్యార్థులకు వరం.. పాలిటెక్నిక్‌ కోర్సు
  • పాలిటెక్నిక్‌ డిప్లొమా.. భవిష్యత్తుకు పునాది
  • ఆగస్టు 11 వ తేదీ స్పాట్‌ సీట్ల కేటాయింపు
  • సివిల్ ఇంజినీరింగ్: 24 సీట్లు ఎలక్ట్రికల్
  • ఇంజినీరింగ్: 08 ఖాళీలు సీట్లు కు దరఖాస్తుల ఆహ్వానం

నాగార్జునసాగర్, విజయక్రాంతి: నాగార్జునసాగర్ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో(Government Polytechnic College) స్పాట్‌ అడ్మిషన్లకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్‌ ఐలయ్య(Principal Ilaiah) శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఒకటిగా పేరుగాంచిన నాగార్జునసాగర్ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రతి సంవత్సరం వివిధ కోర్సుల్లో విద్యార్థులు పెద్ద ఎత్తున చేరుతున్నారని ఆయన తెలిపారు. 

సాంకేతిక విద్య కున్న ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో ఉద్యోగ పరంగా ఎంతో ప్రాముఖ్యత గాంచిన పాలిటెక్నిక్ సాంకేతిక విద్య నిరుద్యోగ యువతీ యువకుల భవిష్యత్తుకు మార్గదర్శనం చూపిస్తుందని ప్రిన్సిపాల్ అన్నారు. నాగార్జునసాగర్ పైలాన్ కాలనీ లో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో గల సివిల్ ఇంజినీరింగ్: 24 సీట్లు ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్: 08 ఖాళీలు సీట్లు కు దరఖాస్తుల ఆహ్వానం వీటి కోసం ప్రభుత్వం సాంకేతిక విద్యాశాఖ ఆధ్వర్యంలో వరకు దరఖాస్తులు చేసుకునే అవకాశం కల్పించిందని ప్రిన్సిపాల్ ఐలయ్య తెలిపారు. ఈ సీట్ల కోసం ఇంటర్నల్ స్లైడింగ్ ప్రక్రియ ఆగస్టు 2వ తేదీ మరియు 3వ తేదీలలో నిర్వహించబడుతుంది.అనంతరం, ఆగస్టు 5వ తేదీ నుండి స్పాట్ అడ్మిషన్ దరఖాస్తు ఫారాలు పంపిణీ చేయబడతాయి. ఆగస్టు 11వ తేదీ లోపు అడ్మిషన్ ప్రక్రియను పూర్తిచేయనున్నాము.

గ్రామీణ విద్యార్థులకు వరం.. సాంకేతిక విద్య

నాగార్జునసాగర్ పైలాన్ కాలనీలోని ఆధునిక సౌకర్యాలతో నిర్మించిన పాలిటెక్నిక్‌ కళాశాల. సివిల్‌, ఈఈఈ,కోర్సులు అందుబాటులో ఉన్నాయి. సివిల్ ఇంజినీరింగ్: 24 సీట్లు ఎలక్ట్రికల్, ఇంజినీరింగ్: 08  సీట్లు ఖాళీలు ఉన్నాయి.,  కోర్సులు, అందుబాటులో ఉన్నాయి. గ్రామీణ పేద విద్యార్థులకు వరంగా మారింది. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన విద్యార్థులే కాకుండా జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన విద్యార్థులు కళాశాలలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. అన్ని సౌకర్యాలతో కూడిన ల్యాబ్‌లు, అనుభవజ్ఞులైన ప్యాకల్టీతో విద్యాబోధన ఉండడంతో నాణ్యమైన విద్యకు బాటలు పడుతున్నాయి. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు విశేష కృషిచేస్తున్నది. నాగార్జునసాగర్ పాలిటెక్నిక్ కళాశాల

ఈ నేపథ్యంలో ఆధునిక టెక్నాలజీకి అనుకూలంగా, డిమాండ్‌ ఉన్న కోర్సులను అందిస్తూ విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తున్నది. నాగార్జునసాగర్ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో విద్యార్థుల సంరక్షణతోపాటు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. విద్యార్థులకు అధ్యాపకులకు.హాజరునమోదుకు బయోమెట్రిక్‌ విధానాన్ని ఉపయోగిస్తున్నారు. పాలిసెట్‌ రాసిన విద్యార్థులు వారి తల్లిదండ్రులకు అడ్మిషన్‌ విధానాన్ని వివరించేందుకు ప్రతి ఏటా అవగాహన సదస్సులను నిర్వహిస్తున్నారు.