01-08-2025 11:05:05 AM
గంజి మురళీధర్ .
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కు వినతి పత్రం అందజేత
నకిరేకల్,(విజయక్రాంతి): జియో ట్యాగ్ కలిగిన చేనేత కార్మికులందరికీ ఎలాంటి షరతులు లేకుండా చేనేత భరోసా అందరికీ ఇవ్వాలని, ప్రభుత్వం ప్రకటించిన లక్ష రూపాయలు తక్షణమే రుణమాఫీ చేయాలని తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి మురళీధర్ డిమాండ్ చేశారు. శుక్రవారం వారంనకిరేకల్ పట్టణంలో లో స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం(Nakrekal MLA Vemula Veeresham)ని కలిసి వినతిపత్రం సమర్పించారు. జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో చేనేత కార్మికుల సమస్యలను ప్రస్తావించాలని వారు కోరారు.ఈ సందర్భంగా గంజి మురళీధర్ మాట్లాడుతూ చేనేత వృత్తి రక్షణ, వృత్తిదారుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన చేనేత భరోసా పథకం ద్వారా జియో టాక్ వేసిన ప్రతి మగ్గానికి ఎలాంటి షరతులు లేకుండా చేనేత కార్మికుడి కి అనుబంధ వృత్తుల కార్మికులకి చేనేత భరోసా పథకం అమలు చేయాలని, జియో టాక్ వేయని మగ్గాలకు కొత్తగా ఇప్పుడు జియో టాక్ వేయాలని డిమాండ్ చేశారు.
చేనేత కార్మికులకు లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని అది వెంటనే ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ వర్తింపచేయాలని లక్ష కు పైగా రుణాలు ఉన్నా ,ప్రభుత్వం చేస్తానన్న లక్ష రూపాయలు వెంటనే మాఫీ చేయాలని, పవర్ లూమ్ కార్మికులకు రుణమాఫీ ప్రకటించాలని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చేనేత కేంద్రాలలో సబ్సిడీతో నూలు డిపోలు ఏర్పాటు చేసి చేనేత కార్మికులకు అందించాలని విజ్ఞప్తి చేశారు. చేనేత, పవర్ లూమ్ కార్మికులకు ఇండ్లు లేని పేదలకు 120 గజాల స్థలం కొనుగోలు చేసి హౌస్ కం వర్క్ షెడ్ నిర్మాణానికి కేంద్రం 10 లక్షలు, రాష్ట్రం 5లక్షలు ఇవ్వాలని , ఇంటి జాగాలు కలిగిన వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని చేనేత కార్మికుల, సహకార సంఘాలలో ఉన్న వస్త్రాల నిలువలను ధాన్యం కొనుగోలు కేంద్రాల తరహాలో వస్త్రాలను కొనుగోలు చేసి చేనేత కార్మికులను ఆదుకోవాలని, 12 సంవత్సరాలుగా సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో సహకార సంఘాలని నిర్వీర్యంఅయిపోతున్నాయని దాని ద్వారా కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రభుత్వం వెంటనే చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని , టెస్కోకు పాలకవర్గాన్ని ఏర్పాటు చేయాలని
ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. చేనేత సహకార సంఘాల క్యాష్ క్రెడిట్ రుణమాఫీ చేయాలని, చేనేత, పవర్లూమ్ పేద కార్మికులందరికీ అంత్యోదయ కార్డులు ఇవ్వాలని. ప్రభుత్వం చేనేత, పవర్లూమ్ కార్మికులకు 8 గంటల పని దినంలో కనీస వేతనం 26000 అమలు జరిగే విధంగా చట్టం చేసి అమలు చేయాలని, గతంలో అనేకమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామని గుర్తు చేశారు. అధికారులు తక్షణమే ఎలాంటి షరతులు లేకుండా చేనేత భరోసా జియో టాక్ కలిగిన కార్మికులందరికీ వర్తింపజేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు చేనేత కార్మికుల పై సమస్యల పరిష్కారానికి తెలంగాణ చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో ,జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేయాలని నిర్ణయించడం జరిగిందని తెలిపారు. .ఈ కార్యక్రమంలో చేనేత సహకార సంఘాల సమన్వయ కమిటీ నలగొండ సూర్యాపేట జిల్లాల అధ్యక్షులు చిలుకూరి లక్ష్మీనరసయ్య ,రావిరాల మల్లయ్య, బాల్యం శ్రీను, రఘుపతి,నాగార్జున ,నామిని ప్రభాకర్, పెడ్యం గణేష్, జనార్ధన్, వెంకటయ్య , లింగయ్య,శ్రీను,లక్ష్మీనారాయణ మార్కండేయ, రాములు చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు