calender_icon.png 2 August, 2025 | 5:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాగార్జున్ సాగర్ వద్ద అద్భుత జలదృశ్యం

01-08-2025 12:09:03 PM

  1. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతుంది..
  2. సాగర్ 26 గేట్ల ద్వారా నీటిని దిగువకు వదులుతున్న అధికారులు..

నాగార్జునసాగర్:విజయక్రాంతి: నాగార్జున సాగర్ ప్రాజెక్ట్(Nagarjuna Sagar Project)కు వరద ఉధృతి కొనసాగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు జలాశయానికి భారీగా వరద నీరు వస్తోంది. దీంతో ప్రాజెక్ట్ నిండుకుండలా మారింది. కాగా అధికారులు ప్రాజెక్ట్ 26 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ అందాలను తిలకించేందుకు పర్యాటకులు భారీగా సాగర్ కు తరలివస్తున్నారు.

ఇవాళ శుక్రవారం 12 గంటల సమయానికి  నాగార్జునసాగర్ కు 2 లక్షల 57 వేల 424 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 585 అడుగులుగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం ప్రాజెక్ట్ నీటి నిల్వ 298.0450 టీఎంసీలు ఉంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు మొత్తం 26 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కాగా 16 గేట్లను 5 అడుగుల మేర, 10 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి 2 లక్షల 57 వేల 424 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరోవైపు ప్రాజెక్ట్ జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.