10 April, 2026 | 3:30 PM

Breaking News

ఉపాధి హామీ పనులు వేసవిలో ఉదయం పూట చేసుకోవాలి   •   'ఇజ్రాయెల్ ఒక క్యాన్సర్ దేశం' — పాకిస్థాన్ రక్షణ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు   •   క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు   •   ఫార్మా కంపెనీలో గాయపడిన కార్మికులకు అండగా ఉంటాం   •   అమెరికా, ఇరాన్ శాంతి చర్చలపై కమ్ముకున్న నీలినీడలు   •   తల్లి ఇద్దరు కుమార్తెల హత్య.. భర్తతోపాటు ఆ 10 మంది అరెస్ట్   •   బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టులన్నీ కాసుల కోసమేనా? అన్నీ మామ, అల్లుడికే తెలుసంటే ఎలా?   •   కాళేశ్వరం దేవస్థానం డైరెక్టర్ గా నియమితులైన కాటం సత్యం   •   గోదావరి పుష్కరాల ఘాట్లకు వెళ్లే రోడ్లను నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలి   •   రచ్చ పల్లిలో చలివేంద్రం ప్రారంభించిన సర్పంచ్ కనవేన స్వప్న శ్రీనివాస్   •  

సామాన్యుల చెంతకు సంక్షేమ పథకాలు

02-07-2025 04:39 PM

ఎంపీడీవో రమేష్ దీన్ దయాళ్

మునగాల: అర్హులైన లబ్ధిదారులందరు సంక్షేమ పథకాలు అందుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఎంపీడీవో రమేష్ దీన్ దయాళ్(MPDO Ramesh Deendayal) అన్నారు. బుధవారం మండల పరిధిలోని కలకోవ గ్రామంలో తెలంగాణ సాంస్కృతిక సారధి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకంను ప్రతి ఒక్కరు తీసుకొవాలని కోరారు. మండల అభివృద్ధి కార్యాలయంలో ఒక ప్రత్యేక కౌంటర్ ను ఏర్పాటు చేసి ప్రజలకు సౌకర్యవంతంగా అధికారులు పనిచేయడం జరుగుతుందని చెప్పారు.

గృహ జ్యోతి  ఉచిత గ్యాస్ సిలిండర్ కు దరఖాస్తు ఇందిరమ్మ ఇండ్లు కట్టుకునే వారికి రెండవ దఫా అవకాశం ప్రభుత్వమే కల్పిస్తున్నదని తెలిపారు. ప్రజా పాలన దరఖాస్తుదారులు ఇప్పటికీ ఏమైనా పథకం అందకపోవడంతో తిరిగి మండల అభివృధి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక సారధి జిల్లా టీమ్ లీడర్ పల్లెల లక్ష్మణ్ సారధి కళాకారులు పాలకుర్తి శ్రీకాంత్ పల్లెల రాము గంట భిక్ష పతి గడ్డం ఉదయ్ పాక ఉపేందర్ కుందమల్ల నాగలక్ష్మి గజ్జి మంజుల సిరి పంగి రాధ మల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.