calender_icon.png 3 July, 2025 | 4:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధి పథంలో మత్స్యాద్రి

02-07-2025 04:44:53 PM

ఘాట్ రోడ్డుకు రైలింగ్ 

వ్రతాలకు ప్రత్యేక భారీ షెడ్

క్యూలైన్లలో స్టీల్ భారీకేడ్స్

ధ్వజస్తంభం వద్ద భారీ గంట

వలిగొండ (విజయక్రాంతి): వలిగొండ మండలం(Valigonda Mandal)లోని వెంకటాపురం గ్రామం పరిధిలో గల శ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం(Sri Matsyagiri Lakshmi Narasimha Swamy Devasthanam) గత కొన్ని నెలలుగా నూతన ఆలయ చైర్మన్ కొమ్మారెడ్డి నరేష్ రెడ్డి, ఆలయ ఈవో సల్వాద్రి మోహన్ బాబు సమన్వయంతో దాతల సహకారంతో అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది. వెంకటాపురం గ్రామం పరిధిలోని మూడు గుట్టల సమూహంలోని ఒక గుట్టపై స్వయంభుగా మత్స్యవతారంలో వెలిసిన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకునేందుకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా వివిధ గ్రామాల నుండి భక్తులు వస్తుంటారు.

కాగా భక్తులు వాహనాల్లో పైకి వెళ్లేందుకు ఘాట్ రోడ్డు ఉండగా అది ప్రమాదకరంగా ఉండడంతో ప్రమాదాలు జరగకుండా ఘాట్ రోడ్డుకు ఇరువైపులా ఎంపీ నిధుల నుండి స్థానిక ఎమ్మెల్యే సహకారంతో రైలింగ్ ఏర్పాటు చేయించడం జరిగింది. దీంతో భక్తులు ఘాట్ రోడ్డులో ప్రమాదాలు జరగకుండా రైలింగ్ ఏర్పాటు చేయడం అభినందనీయమని అంటున్నారు. అదేవిధంగా గతంలో కొండపై భక్తులు సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకునేందుకు సరైన సౌకర్యాలు లేకపోగా కొన్ని రోజుల క్రితం అన్ని సౌకర్యాలతో భారీ షెడ్ ను సత్యనారాయణ స్వామి వ్రత పీటలకు మరియు షెడ్డుకు నూతన రంగులను ఏర్పాటు చేయడం జరిగింది.

అదేవిధంగా భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు వెళ్లేందుకు స్టీల్ రాడ్లతో క్యూలైన్లను, ఫ్లోరింగ్ కు టైల్స్ ను ఏర్పాటు చేయించడం పార్కింగ్ వద్ద స్థలాన్ని విస్తరించడం, రోడ్డు వెడల్పు చేయడం వంటివి జరిగింది. అదే విధంగా ధ్వజస్తంభం వద్ద రెండు పిల్లర్లపై మత్స్య అవతారంలో ఉన్న చేపకు భారీగంటను ఏర్పాటు చేయడం అద్భుతంగా కనిపిస్తుంది. ఈ సందర్భంగా చైర్మన్ నరేష్ రెడ్డి మాట్లాడుతూ తనకు చైర్మన్ గా అవకాశం ఇచ్చిన స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని తనకు ఆలయ అభివృద్ధి ప్రధానమని తన కాల పరిమితిలో దాతల సహకారంతో, ప్రభుత్వం ద్వారా నిధులు మంజూరు చేయించి గుట్టపై మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తానని అన్నారు.