10 April, 2026 | 5:34 PM

Breaking News

తంగళ్ళపల్లిలో ఘనంగా ప్రారంభమైన కేసీఆర్ క్రికెట్ కప్ 2026 క్రీడా పోటీలు   •   రాష్ట్ర కో కన్వీనర్ గా బద్రి శీను   •   ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి   •   గల్ఫ్ బాధితుల కోసం అడ్వైజరీ కమిటీ ఏర్పాటు   •   సంపూర్ణ ఆరోగ్యం యోగతోనే సాధ్యం - జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి   •   చేనేత కార్మికుల ఆత్మగౌరవానికి అండగా నిలుస్తాం   •   శ్రీ భక్తంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబు   •   రాజ్యసభ సభ్యుడిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం   •   రహదారి ప్రమాదాలు నివారణకు చర్యలు   •   పశువులలో గాలి కుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం   •  

పెండింగ్‌లో ఉన్న ఫీజు రియంబర్స్ మెంట్ వెంటనే విడుదల చేయాలి

02-07-2025 04:18 PM

పిడిఎస్ యు డివిజన్ జనరల్ సెక్రటరీ పులి రాఖీ

అనంతగిరి: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చి 18 నెలలు అవుతున్న నేటికి పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్ మెంట్ విడుదల చేయకుండా నిర్లక్ష్యం వహిస్తుందని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పిడిఎస్యు) డివిజన్ ప్రధాన కార్యదర్శి పులి రాఖి అన్నారు. బుధవారం పి డి ఎస్ యు ఆధ్వర్యంలో అనంతగిరి మండల పరిధిలోని ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీలో నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులోకి వచ్చే ముందు వారి మేనిఫెస్టోలో విద్యార్థులకు న్యాయం చేస్తానని చెప్పి పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి నేటికీ 18 నెలలు గడుస్తున్నప్పటికీ విద్యార్థులకు రావాల్సిన 7200 కోట్ల రూపాయలు విడుదల చేయకుండా నిర్లక్ష్యం వహించడం అంటే పేద విద్యార్థుల పట్ల ఏ విధమైన ప్రేమ ఉందో అర్థం అవుతుందని వారన్నారు.

విద్యార్థుల హక్కు అయినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయడంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారో అర్థం కావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి ఫీజు రియంబర్స్ మెంట్ ఎత్తివేయాలని కుట్రలో భాగంగానే ఈ విధంగా చేస్తున్నారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. విద్యార్థులకు రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ ను వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

లేనిపక్షంలో దశల వారి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించుతామని హెచ్చరించారు. గత నెలలో అందాల పోటీలకు 200 కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్వహించాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. విద్యార్థులకు ఫీజులు ఇవ్వలేని ప్రభుత్వం అందాల పోటీలకు ఏ విధంగా ఖర్చు పెట్టిందని ప్రశ్నించారు. విద్యార్థుల హక్కు అయినటువంటి ఫీజు రియంబర్స్ మెంట్ వెంటనే విడుదల చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.