వెస్ట్‌బ్రుక్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రారంభం
ప్రారంభించిన సుధారెడ్డి
హైదరాబాద్, మార్చి 23 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని మాదాపూర్, కావూరి హిల్స్‌లో వెస్ట్‌బ్రుక్ ఇంటర్నేషనల్ స్కూల్ ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ప్రముఖులు, విద్యావేత్తలు, ఆహ్వానితులు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా మెఘా ఇం జినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ డైరెక్టర్, దాతృత్వవేత్త సుధారెడ్డి హాజరై పాఠశా లను ప్రారంభించారు.
సంజనారెడ్డి స్థాపించిన ఈ విద్యాసంస్థ ఒక సాధారణ పాఠశాల మాత్రమే కాకుండా, ఒక తల్లి ఆలోచనకు రూపం దాల్చిన విద్యా దృక్పథం. అనుభవజ్ఞులైన విద్యావేత్తల సహకారంతో ప్రతి వి ద్యార్థిలో ఆసక్తి, ప్రతిభను వెలికితీయడం ల క్ష్యంగా ఈ సంస్థ ఏర్పడింది. నగరంలోని ప్ర ధాన ప్రాంతంలో ఉన్న ఈ పాఠశాల అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సమ గ్ర పాఠ్య ప్రణాళికను అందిస్తూ, వ్యక్తిగత అభ్యాసం, బలమైన అకడమిక్ పునాది మరి యు ప్రాక్టికల్ లెర్ని్ంప దృష్టి సారిస్తుంది.
సంప్రదాయ పద్ధతులకంటే నాణ్యత, పారదర్శకత మరియు అర్థవంతమైన విద్యను ప్రా ధాన్యంగా తీసుకుంటోంది. ఈ సందర్భంగా సుధారెడ్డి మాట్లాడుతూ.. ఈ స్కూల్‌ను ప్రా రంభించడం నాకు ఆనందంగా, గౌరవంగా ఉంది. ప్రతి పిల్లవాడికి తల్లి మొదటి గురు వు. సంజనా ఈ పాఠశాలను వ్యాపార దృ క్పథంతో కాకుండా, తల్లిదండ్రుల దృక్పథం తో ప్రారంభించడం చాలా గొప్ప విషయం అన్నారు. సంజనారెడ్డి మాట్లాడుతూ.. ఒక తల్లిగా నా వ్యక్తిగత అనుభవం నుంచి ఈ పాఠశాల ఆవిర్భవించింది.
పిల్లలు తమ ఆసక్తులను అన్వేషించుకునేలా, స్వతంత్రంగా ఆ లోచించేలా, ఆత్మవిశ్వాసంతో కూడిన, విలువలతో కూడిన వ్యక్తులుగా ఎదగడానికి అ నుకూలమైన వాతావరణాన్ని సృష్టించడం మా లక్ష్యం అని తెలిపారు. టపస్య స్కూల్ గ్రూప్ ఆధ్వర్యంలో అకడమిక్ వ్యవస్థను రూ పొందించగా, కో-ఫౌండర్ అండ్ అకడమిక్ డైరెక్టర్ కొడూరు మధుసూదనరెడ్డి, కో-ఫౌండర్ అండ్ ప్రిన్సిపాల్ కె. పద్మ ప్రవీణా తమ అనుభవంతో పాఠశాలకు బలమైన విద్యా పునాది అందిస్తున్నారు. కొడూరు మధుసూదనరెడ్డి, పద్మ ప్రవీణా కొడూరు విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి తోడ్పడే ఉత్తమ విద్యా వాతావరణాన్ని అందించడానికి తమ కట్టుబాటును వ్యక్తం చేశారు.




