19 August, 2026 | 3:15 PM

Breaking News

మంత్రి కోమటిరెడ్డికి ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి వినతి   •   ఓడ్ల కృష్ణ కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్‌ఎస్ నేతలు   •   పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను SBTET పరిధిలోనే కొనసాగించాలినీ విద్యార్థుల ధర్నా   •   సీఎం రేవంత్‌, పొంగులేటిపై హరీష్‌ రావు సంచలన వ్యాఖ్యలు   •   మిషన్ భగీరథ పైప్ లైన్ కోసం ఖాళీ బిందెలతో నిరసన   •   బాల్య వివాహాలు లేని గ్రామంగా అంకుసాపూర్   •   మాజీ ఎమ్మెల్యే కిశోర్ జర్నలిస్టు వీరమల్లును పరామర్శ.   •   అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం   •   స్కూటీ డిక్కీలో గంజాయి.. పోలీసులకు చిక్కిన నిందితుడు   •   ప్రజల సమస్యల పరిష్కారమే ప్రథమ ప్రాధాన్యత   •  

తడిసిన ధాన్యానికి మద్దతు ధరకు కొనుగోలు చేయాలి

14-04-2025 08:40 PM

మునగాల: సూర్యాపేట జిల్లా మునగాల ఆదివారం రాత్రి మండల వ్యాప్తంగా భారీ గాలి దురమారంతో అకస్మాత్తుగా కురిసిన వర్షానికి నేలరాలిన ధాన్యాన్ని కల్లాల వద్ద తడిసిన వరి పంటను రాష్ట్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని బిఆర్ఎస్ పార్టీ మండల సీనియర్ నాయకులు మునగాల పిఎసిఎస్ చైర్మన్ కందిబండ సత్యనారాయణ, బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఉడుం కృష్ణ డిమాండ్ చేశారు. సోమవారం మండల కేంద్రంలో వర్షం నీటిలో తడిసిన వరి ధాన్యాన్ని  వర్షానికి నేలకొరిగిన పంట పొలాలను వారు స్థానిక పార్టీ శ్రేణులతో కలిసి పరిశీలించారు.

అనంతరం  మాట్లాడుతూ... రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 60% కోతలు పూర్తయిన నేటికీ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా ఒక్క గింజ కూడా కొనుగోలు చేయకపోవడంతో, ప్రైవేటు రైస్ మిల్లర్స్  దళారులు కమిషన్ దారులు సిండికేట్ గా ఏర్పడి రైతు పండించిన ధాన్యానికి మద్దతు ధర లేకుండా క్వింటాలుకు 1400 రూపాయల నామమాత్రపు రేటుకు కొనుగోలు చేసే పరిస్థితి వచ్చిందని, మరొకవైపు అకాల వర్షంతో అన్నదాత ఆరుగాలం పండించిన పంట వర్షపు నీటిలో తడిసి కొట్టుకుపోయి,  పంట పొలంలోనే పైరు నేలకొరిగి పొలంలోనే వడ్లు నేలరాలి స్థానిక రైతాంగం తీవ్రంగా నష్టపోయారని, కావున ప్రభుత్వం ఇప్పటికైనా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా తడిసిన ధాన్యాన్ని మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని లేకపోతే రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు, కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు నాగిరెడ్డి, లక్య నాయక్,ఎల్పి రామయ్య, గడ్డంలింగయ్య, చీకటి శ్రీను, వేట శివాజీ,  నరసింహారావు, రాజేష్, నవీన్ రెడ్డి, నాగబాబు, చిరంజీవి, నవీన్, ఎల్పి వెంకయ్య, లక్ష్మయ్య, గురుమూర్తి, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.