4 April, 2026 | 2:11 PM

Breaking News

యాదగిరిగుట్టలో గిరిప్రదక్షిణ.. భారీగా తరలివచ్చిన భక్తులు   •   క్యాతనపల్లి మున్సిపల్ పీఠం బీఆర్ఎస్ కైవసం!.. చైర్మన్‌గా సంధ్యారాణి— వైస్‌ చైర్‌పర్సన్‌గా సరిత   •   ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం— చైర్మన్‌గా టేకుల సుదర్శన్ రెడ్డి   •   ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులను చేర్పించాలి   •   బడికి డుమ్మా కొడుతున్న టీచర్లు — పిల్లల చదువుకు ఎగనామం   •   జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై సత్తు మల్లేశం ఆగ్రహం   •   బీఆర్ఎస్ పార్టీ నీచ బుద్ధి వీడాలి   •   హాస్పిటల్ ఇన్ఫెక్షన్ల నివారణపై అవగాహన కార్యక్రమం   •   క్యాతనపల్లి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు పటిష్ఠ బందోబస్తు   •   నాటు సారా తాగి ముగ్గురు మృతి — సారా వల్లే మరణించారా ?   •  

ఎయిమ్స్‌లో అత్యవసర సేవలేవి?

30-06-2024 12:00 AM

సమీక్షలో అధికారులపై ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అసహనం

యాదాద్రి భువనగిరి, జూన్ 29 (విజయక్రాంతి): అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)లో అత్యవసర వైద్య సేవల విభాగాన్ని ఇప్పటివరకు ప్రారంభిం చకపోవడంపై భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ఎంపీగా ప్రమాణ స్వీకా రం చేసిన తర్వాత తొలిసారిగా భువనగిరి నియోజకవర్గ పర్యటనకు వచ్చిన ఆయన బీబీనగర్ ఎయిమ్స్‌ను సందర్శించారు. ఆసుపత్రిలో పలు వైద్య విభాగాలను పరిశీలించారు. ఆసుపత్రి భవన సముదాయాల నిర్మాణాలను పరిశీలించారు. అనంతరం ఎయిమ్స్ పాలనా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఆసుపత్రిలో అత్యవసర సేవా విభాగం లేకపోవడంతో రోడ్డు ప్రమాద బాధితులు, గుండెపోటు వంటివి వచ్చినవారు వైద్యం అందక మరణించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు. వెంటనే అత్యవసర వైద్య సేవా విభాగం ప్రారంభించాలని సూచించారు. అదే విధంగా ఆసుపత్రి నిర్మాణంలో జాప్యం ఎందుకు జరుగుతుందని ప్రశ్నించారు. ఆసుపత్రిలో వివిధ స్థాయిల ఉద్యోగాల నియామకాలను పారదర్శకంగా చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్ రెడ్డి, ఎయిమ్స్ డైరెక్టర్ వికాస్ బాటియా, కలెక్టర్ హనుమంత్ కే జండగే, ఎయిమ్స్ వివిధ విభాగాల అధిపతులు పాల్గొన్నారు.