4 April, 2026 | 3:44 PM

Breaking News

మేడ్చల్ పెద్ద చెరువు కట్ట పైనుంచి కిందకు రోడ్డు వేసిన వారిపై చర్యలు తీసుకోవాలి   •   రూ.225 కోట్లతో బాసర అభివృద్ధి — మాస్టర్‌ ప్లాన్​పై సీఎం రేవంత్ సమీక్ష   •   ఫుట్‌పాత్‌ ఆక్రమణలపై జీహెచ్ఎంసీ కొరడా   •   గజ్వేల్‌లో పొలిటికల్ హైటెన్షన్.. KCR క్యాంప్ ఆఫీసులో రేవంత్ రెడ్డి ఫోటో   •   వైద్యసేవల్లో నిర్లక్ష్యం, సహించేది లేదు: ఆసుపత్రి నిర్వహణపై హరీష్ రావు అసహనం   •   యాదగిరిగుట్టలో గిరిప్రదక్షిణ.. భారీగా తరలివచ్చిన భక్తులు   •   క్యాతనపల్లి మున్సిపల్ పీఠం బీఆర్ఎస్ కైవసం!.. చైర్మన్‌గా సంధ్యారాణి— వైస్‌ చైర్‌పర్సన్‌గా సరిత   •   ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం— చైర్మన్‌గా టేకుల సుదర్శన్ రెడ్డి   •   ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులను చేర్పించాలి   •   బడికి డుమ్మా కొడుతున్న టీచర్లు — పిల్లల చదువుకు ఎగనామం   •  

వాడీవేడిగా మెదక్ బల్దియా సమావేశం

30-06-2024 12:00 AM

సమస్యలపై చైర్మన్‌ను నిలదీసిన వైస్ చైర్మన్ 

మెదక్, జూన్ 29 (విజయక్రాంతి): మెదక్ మున్సిపాలిటీ సమావేశం చైర్మన్ టీ చంద్రపాల్ అధ్యక్షతన శనివారం వాడీవేడిగా సా గింది. ఈ సందర్భంగా పలువురు వార్డు కౌన్సిలర్లు తమ సమస్యలను తెలియజేయగా, సమస్యలపై ఫిర్యాదు చేయాలని చైర్మన్ చంద్రపాల్ సూచించడంతో వైస్ చైర్మన్ ఆరేళ్ల మల్లికార్జున్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమ్యామ్యాలు ఇస్తేనే వార్డుల్లో పనులు చేస్తా రా.. అంటూ మున్సిపల్ చైర్మన్‌పై వైస్ చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్‌లో మున్సిపల్ చెత్త ఆటో చెడిపోతే 9 నెలలుగా ఎందుకు మరమ్మతు చేయలేదని కౌన్సిలర్లు నిలదీశారు.

ప్రత్యేక శానిటేషన్ పేరుతో 50 మంది లేబర్లను పెట్టినట్లు ప్రియంబుల్‌లో పెట్టారని, ఆ కూలీల వివరాలు, పేర్లు, ఇచ్చిన ఇండెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో చైర్మన్, వైస్ చైర్మన్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సమయంలోనే ఆగ్రహించిన వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్ వేదిక మీది నుంచి కిందికి దిగి వచ్చి తోటి కౌన్సిలర్లతో కూర్చున్నారు. టీయూఎఫ్‌ఐడీ నిధులు కొన్ని వార్డులకు మాత్రమే పెడుతున్నారని, ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించగా.. అవసరం ఉన్న వార్డులకే పెట్టామని కమిషనర్ తెలిపారు. అయితే అన్ని వార్డులకు ప్రాధాన్యత ఇస్తామని చైర్మన్ హామీ ఇవ్వడంతో సభ్యులు శాంతించారు.