calender_icon.png 10 September, 2025 | 1:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జలపుష్పాలేవి?

10-09-2025 12:31:18 AM

  1. చెరువులు, కుంటలు నిండినా పంపిణీ చేయని చేపపిల్లలు

ఆందోళనలో మత్స్యకారులు

కరీంనగర్, సెప్టెంబరు 9 (విజయ క్రాంతి): భారీ వర్షాలతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు నిండుకుండలా మారాయి. ప్రతి సంవత్సరం జూలై, ఆగస్టు మాసాల్లో చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం సెప్టెంబర్ మాసం వచ్చినా చేప పిల్ల లు చెరువులు, కుంటల్లో వేయకపోవడంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రాజెక్టులు, చె రువులు, కుంటలకు భారీ వర్షాలతో జలకళ సంతరించకుంది. ఉమ్మడి జిల్లాలో చేప పిల్ల ల పంపిణీకి ప్రభుత్వం 7.44 కోట్ల రూ పాయలు కేటాయించింది. 3441 చెరువుల్లో 6.22 కోట్ల చేప పిల్లలను వదిలేందుకు లక్ష్యా న్ని నిర్దేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 452 చెరువులు, 4 ప్రధాన ప్రాజెక్టుల్లో 1.48 కోట్ల చేప పిల్లలు వదలనున్నారు. ఇందులో మిడ్మానేరులో 28.68 లక్షలు, ఎగువ మానేరులో 10.50 లక్షలు, మల్కపేట రిజర్వాయ ర్ లో 7.49 లక్షలు, అన్నపూర్ణ రిజర్వాయర్లో 13.69 లక్షలు పంపిణీ చేసేందుకు 1.75 కో ట్లు కేటాయించారు.

అలాగే జగిత్యాల జిల్లాలోని 1,016 చెరువుల్లో కోటి చే పిల్లలను వ దిలేందుకు 2.20 కోట్ల రూపాయలకు కేటాయించారు. పెద్దపల్లి జిల్లాలోని 957 చెరువుల్లో 1.59 కోట్ల చేపపిల్లల పంపిణీకి 1.58 కోట్లు, కరీంనగర్ జిల్లాలో 1016 చె రువులు, లోయర్ మానేరు డ్యాం లో 2.15 కో ట్ల చేపిపిల్లలను వదిలేందుకు 2.17 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించారు. రాష్ట్ర ప్రభు త్వం చేపపిల్లల పంపిణీకి టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది.

కాంట్రాక్టర్లు ముం దురాకపోవడంతో చేపపిల్లల పంపిణీలో జా ప్యం అవుతున్నది. సెప్టెంబర్ మొదటి వారంలోనే చేప పిల్లల పంపిణీ కార్యక్రమం ఉంటుందని భావించారు. కానీ కాంట్రాక్టర్లు ముందుకు రాక టెండర్లు పూర్తికాకపోవడంతో చేపపిల్లల పంపిణీ కార్యక్రమం నిలిచి పోయింది. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకొని టెండర్లు ఖరారు చేసి చేప పిల్లలు పంపిణీ చేయాలని మత్స్యకారులు కోరుతున్నారు. 

సొసైటీలకు అప్పగించాలి

చేపపిల్లల పంపిణీ ఆలస్యమవుతున్నది. టెండర్ ప్రక్రియ ద్వారా పంపిణీ చేయాలనుకున్నారు, టెండర్లు వేసేందు కు ఎవరు ముందుకు రావడం లేదు. జూలైలో చేపపిల్లలను చెరువులో వేయా ల్సి ఉండగా ఇప్పటి వరకు అమలుకు నోచుకోవడం లేదు. సొసైటీలకు అప్పగిస్తే సభ్యులే పిల్లలను పెంపకం చేసు కుంటారు. ప్రభుత్వం ఇప్పటికైనా చేపపిల్లలను సొసైటీలకుఅప్పగించాలి

 పోలు లక్ష్మణ్, మత్స్య పారిశ్రామిక సహకార సంఘం మాజీ అధ్యక్షుడు, కరీంనగర్