సర్కారు బాయికాడ ఏం జరిగింది?
శ్రీరామ్ నిమ్మల, వర్షిక హీరోహీరోయన్లుగా నటిస్తున్న సినిమా ‘సర్కారు బాయి’. తుమ్మల ప్రఫుల్ రామ్‌రెడ్డి నిర్మిస్తున్నా రు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ప్రాంతం లో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా దర్శకుడు లారా ఈ సిని మాను రూపొందిస్తున్నారు. అప్పటి తెలంగాణ సమాజంలో నీటి సమస్యలు, కుల వివక్ష, అణగారిన వర్గాల జీవిత పోరాటం వంటి అంశాలతో తెరకెక్కుతున్న చిత్రమిది .
ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. శుక్రవారం హీరో శ్రీరామ్ నిమ్మల పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ టీమ్ ప్రత్యేక పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్‌లో తెలంగాణ పల్లె యువకుడిగా ఎంతో సహజంగా శ్రీరామ్ నిమ్మల కనిపిస్తున్నారు. హీరోగా, నటుడిగా ఆయనకు ‘సర్కారు బాయి’ మంచి పేరు తెస్తుందనే అంచనాలు ఏర్పడుతున్నాయి. ప్రస్తుతం ‘సర్కారు బాయి‘ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా నుంచి మరిన్ని అప్డేట్స్ త్వరలో మేకర్స్ వెల్లడిస్తారు.






