17 April, 2026 | 10:34 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

పేదింటి ఆడబిడ్డ పెళ్లికి తులం బంగారం ఏమైంది?

11-04-2025 12:00 AM

ఎమ్మెల్యే కోవ లక్ష్మి

కుమ్రం భీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 10(విజయ క్రాంతి):పేదింటి ఆడబిడ్డ పెళ్లికి నగదు తో పాటు తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి మోసం చేసిందని ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆరోపించారు.గురువారం జైనూర్,సిర్పూర్ యు.లింగాపూర్ మండలాలకు చెందిన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను మార్కెట్ కమిటీ చైర్మన్ విశ్వనాధ్ తో కలిసి పంపిణి  చేశారు.

ఈ సంద ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చిందని వాటిని అమలు చేయడంలో విఫలమైందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు.కెసిఆర్ ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉన్నారని తెలిపారు.కార్యక్రమంలో ఆయా మండలాల తహశీల్దార్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.