ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏంటి?

09-07-2024 12:05:00 AM

పెళ్లయిన సెలబ్రిటీ మహిళలే కాదు.. సాధారణ మహిళలు కూడా ఎగ్ ఫ్రీజింగ్‌ను వాడేస్తున్నారు. ఈ ట్రెండ్ వేగంగా పెరుగుతున్నది. ప్రియాంక చోప్రా, ఏక్తా కపూర్ నుంచి మోనా సింగ్ ఇలా చాలామంది నటీమణులు తమ గుడ్లను భద్రప రుచుకున్నారు. అసలు ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏంటి? తల్లి కావడానికి ఎలా సహాయపడుతుందో తెలుసుకుందాం.. 

ఈ పద్ధతిని మొట్టమొదట 1986లో ఉపయోగించారు. దీని ఘనత సింగపూర్‌కు చెందిన డాక్టర్ క్రిస్టోఫర్ చెన్‌కు దక్కుతుంది. 1997లో ప్రపంచ సుందరి డయానా హేడెన్ ఎగ్ ఫ్రీజింగ్ ప్రక్రియ ద్వారా రెండుసార్లు తల్లి అయింది. ఆమెకు 2016లో ఒక కుమారై, 2018లో ఆమెకు కవలలు.. ఒక అబ్బాయి, ఒక అమ్మాయికి జన్మనిచ్చింది. ఎగ్ ఫ్రీజింగ్ దీన్ని వైద్య భాషలో ‘ఓ సైట్ క్రయోప్రెజర్వేషన్’ అంటారు. నిజానికి, అండాశ యం లోపల చిన్న అభివృద్ధి చెందని గుడ్లు ఉంటాయి. వాటిని ఇంజెక్షన్లు ఇవ్వడం ద్వారా అభివృద్ధి చేస్తారు. గుడ్డు గడ్డకట్టడానికి 12-13 ఇంజెక్షన్లు ఇస్తారు. గుడ్లు పూర్తిగా అభివృద్ధి చెందిన తర్వాత, గుడ్లు శస్త్ర చికిత్స ద్వారా తొలగించబడతాయి. వాటిని ఫ్రీజింగ్ చేస్తారు.

ఆ తరు వాత ఆ స్త్రీ గర్భవతి కావాలనుకున్నప్పుడు ఆ అండాలను ల్యాబ్‌లో స్పెర్మ్‌తో ఫలదీకరణం చేస్తారు. ఒక పిండం ఏర్పడి స్త్రీ గర్భాశయంలో అమర్చబడుతుంది. ప్రతి స్త్రీ అండాశయాలు పరిమిత స్థాయి లో మాత్రమే గుడ్లను ఉత్పత్తి చేస్తాయి. ఒక సాధారణ స్త్రీ తన జీవితకాలంలో 400 నుంచి 500 గుడ్లు ఉత్పత్తి చేస్తుం ది. స్త్రీకి ప్రారంభంలో సుమారు 6-7 రోజులు ఇంజెక్షన్లు ఇస్తారు. దీని తర్వాత ఆరోగ్యకరమైన గుడ్డు కోసం దాన్ని ప్రయోగశాలలో సురక్షితంగా ఉంచుతారు. దీన్నే ఎగ్ ఫ్రీజింగ్ అంటారు.