14 March, 2026 | 7:06 PM

కందులు కొనుగోలు కేంద్రం ప్రారంభం

14-03-2026 05:37 PM

చొప్పదండి,(విజయక్రాంతి): చొప్పదండి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో కందుల కొనుగోలు కేంద్రాన్ని గౌరవ చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం శనివారంఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ... రైతులు తాము పండించిన పంటను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకొని ప్రభుత్వం కల్పించే మద్దతు ధరను పొందగలరని తెలిపారు. ప్రస్తుతం కందులు క్వింటాలకు రూ.8000 చొప్పున చొప్పదండి సహకార సంఘం ఆధ్వర్యంలో మార్కుఫెడ్ ద్వారా వ్యవసాయ మార్కెట్ కమిటీ చొప్పదండిలో  కొనుగోలు చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.