2 July, 2026 | 11:56 AM

Breaking News

తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత, హరీశ్ రావు, బీఆర్ఎస్ నేతలు అరెస్ట్   •   ఎమ్మెల్యే హైదరాబాద్‌లో కాదు... నియోజకవర్గంలో ఉండాలి: బొల్లం   •   అధికార పార్టీ నేత కిరాతకం.. వితంతు మహిళపై అత్యాచారం   •   డీఎస్పీ భీమ్ రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు   •   సవాళ్లు, ప్రతిసవాళ్లు.. చర్చకు సిద్ధమైన మంత్రులు   •   భారీ వర్షానికి పశు వైద్య కార్యాలయ ప్రాంగణం జలమయం   •   డీ- అడిక్షన్ సెంటర్‌లో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య   •   కరస్‌గుత్తిలో భూ రీ-సర్వే, సర్-2026 పనులను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్   •   ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించాలి- జిల్లా కలెక్టర్   •   ఆటో బోల్తాపడి 10 మందికి తీవ్రగాయాలు   •  

ఏ లోషన్ వాడుతున్నారు?

09-07-2024 12:05 AM

బాడీ లోషన్లు వాడటం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. అయితే వాటిని వాతావరణాన్ని బట్టి మారుస్తూ ఉండాలి. ప్రతిసారి ఒకే రకమైన లోషన్లను వాడటం వల్ల అనేక సమస్యలు వస్తాయి. కాబట్టి నిపుణుల సలహా మేరకు లోషన్లు ఉపయోగించాలి. 

* కాలానుగుణంగా ఉన్న క్రీమ్ లేదా లోషన్స్ వాడితేనే ప్రయోజనం ఉంటుందని సూచిస్తున్నా రు నిపుణులు. లేకపోతే చర్మం తన గుణాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అలా వాడితే అనేక రకాలైన చర్మవ్యాధుల భారిన పడే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. 

* వాతావరణంతోనే కాకుండా కొన్ని ఇండ్లల్లో, స్విమ్మింగ్ ఫూల్స్, వ్యాయామం చేసుకునే క్రమంలో కూడా వివిధ రకాలా బాడీ లోషన్స్ వాడుతూ ఉంటారు. స్విమ్మింగ్ తర్వాత అందులోని క్లోరిన్ చర్మంపై పడి పొడిగా మారే అవకాశం ఉంటుందని చెబుతున్నారు డెర్మటాలజిస్టులు. 

* చర్మం రఫ్‌గా పొడిబారిపోయినట్లయితే వాటికి అనుగుణంగా సరైన లోషన్స్ వాడుతూ ఉండాలి. అలా చేయడం వల్ల కొన్ని రోజులకు చర్మం మృదువుగా మారే అవకాశం ఉంటుందని డెర్మటాలజిస్టులు చెబుతున్నారు. వీటిని వైద్యుల సలహా, సూచనలతో మాత్రమే ఉపయోగించాలి.