50 శాతం సీట్ల పెంపుతో జరిగే నష్టమేంది?
కేంద్రమంత్రి బండి సంజయ్
హైదరాబాద్, ఏప్రిల్ 13 (విజయక్రాం తి): సీఎం గారూ.. 50 శాతం సీట్ల పెం పుతో దక్షిణాదికి జరిగే నష్టమేందని, ప్రజల్లో లేనిపోని భయాందోళనలు సృష్టించి విభజించా లనుకుంటున్నారా? అని కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. డబ్బు సమకూర్చే వాళ్లకే ప్రాధాన్యం ఇవ్వాలని చెబుతున్నా రా?, డబ్బుకు, ఓటుకు, సీటుకు లింకు పెడతారా?, లక్ష కోట్లు ఉన్న మీ కుటుంబానికి లక్ష ఓట్లు ఇవ్వా లా? అంటూ సో మవారం ఒక వీడియోను విడుదలచేశారు.
డబ్బులేని పేదవాడికి ఓటు హక్కు కల్పించొద్దా?, మీ లెక్క ప్రకారం.. ముంబైకి, ఢిల్లీకి మాత్రమే అత్యధిక సీట్లు ఉండాలా? అని ప్రశ్నించారు. వెనుకబడ్డ ఆదిలాబా ద్, పాలమూరు జిల్లాలకు సీట్లు పెంచాల్సిన అవసరమే లేదా అని నిలదీశా రు. మీ పార్టీ సిద్ధాంతం ప్రకారం అంబేద్కర్ రాజ్యాంగాన్ని నమ్ముకున్న మనిషికి విలువ లేదా అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ మిమ్ముల్ని మనీ మనిషిగా మార్చిందా? అని వ్యాఖ్యానించారు. ఇప్పుడు దక్షిణాదిలో ఎన్ని సీట్లు ఉన్నాయి.. ఇది చేసింది మీ పార్టీనే కదా అన్నారు. విభజన అనేది మీ పార్టీ డీఎన్‌ఏలోనే ఉన్నట్టుందన్నారు.
యూపీఏ సర్కార్ చెప్పిన ఏపీ పునర్విభజన యాక్ట్ ప్రకారం తెలంగాణలో అసెంబ్లీ సీట్ల సంఖ్యను 119 నుంచి 153కు మాత్రమే పరిమితం చేయా లా అని నిలదీశారు. మీరు చెప్పిన ఆర్థిక (జీఎస్డీపీ) సూత్రం ప్రకారమే డీలిమిటేషన్ చేయాలా? అని ప్రశ్నించారు. అంబానీసహా ఈ దేశంలో ఎవరికి ఎన్ని లక్షల కోట్ల ఆస్తి ఉంటే అన్ని లక్షల ఓట్లు ఇవ్వాలా? అన్నారు. అంబేద్కర్ పుట్టిన రోజునాడే ఆయన సిద్ధాంతాలను చంపేయాలని చూస్తన్నారా అని పేర్కొన్నారు. కాంగ్రెస్ ముమ్మాటికీ మహిళా రిజర్వేషన్లకు వ్యతిరేకమే అన్నారు.




