26 July, 2026 | 10:51 AM

మంత్రి పొన్నం సమాధానమేది?

27-06-2024 12:49 AM

బీఆర్‌ఎస్ ఎమ్యెల్యే పాడి కౌశిక్

హైదరాబాద్, జూన్ 26 (విజయక్రాంతి): తాను విసిరిన సవాళ్లకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఎలాంటి సమాధానం చెప్పలేదని, వెంకటేశ్వరస్వామి దేవాలయానికి వస్తారనుకుంటే రాలేదని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన జూబ్లీహిల్స్‌లోని వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తాను నీతిమంతుడనని చెప్పుకుంటున్న పొన్నం ప్రభాకర్ ఫ్లుయాష్ విషయంలో రూ.100 కోట్ల అవినీతికి పాల్పడ్డారని తాను ఆరోపించినా ఇంతవరకు నోరు విప్పకపోవడం ఏమిటని ప్రశ్నించారు. లీగల్ నోటీసులకు భయపడేది లేదని పేర్కొన్నారు. నిజంగా పొన్నం ప్రభాకర్ నిజాయి తీపరుడైతే  గుడికి ఎందుకు రాలేదని ప్రశ్నించారు.

సవాల్‌ను స్వీకరించలేదంటే స్కాం చేశారని పరోక్షంగా అంగీకరించినట్లేనని విమర్శించారు. తన అవినీతికి ఆధారాలున్నాయా అని అడుగుతున్న ఆయనకు గతం లోనే ఆధారాలు చూపించినట్లు చెప్పారు. ఫ్లుయాష్ లారీలను తాను హుజురాబాద్‌లో పట్టపగలు స్వయంగా పట్టుకున్నానని, ఒక్కో లారీ 76 టన్నులకు పైగా తరలిస్తున్నట్లు ఉందని చెప్పారు. నిబంధనల ప్రకారం 16 టైర్ల లారీపై 36 టన్నులే మాత్రమే తీసుకెళ్లాలని, అధికారులు మంత్రులు, ఎవరు అవినీతికి పాల్పడుతున్నారో బ్లాక్‌బుక్‌లో నమోదు చేస్తానని, కేసిఆర్ మళ్లీ అధికారంలోకి వస్తారని అప్పుడు వారందరికీ  బ్లాక్ డేస్ రాక తప్పదనిహెచ్చరించారు.