26 July, 2026 | 12:03 PM

1 నుంచి కొత్త క్రిమినల్ చట్టాలు

27-06-2024 12:37 AM

కొత్త చట్టాల ప్రకారమే కేసులు.. పోలీసులకు డీజీపీ ఆదేశాలు

హైదరాబాద్, జూన్ 26 (విజయక్రాంతి): జూలై 1 నుంచి దేశ వ్యాప్తంగా కొత్త ప్రధాన క్రిమినల్ చట్టాలు అమల్లోకి వస్తాయని డీజీపీ రవి గుప్తా తెలిపారు. ఒకటో తేదీ నుంచి నూతన చట్టాల ప్రకారమే కేసులు నమోది చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. జూన్ చివరి వరకు అమల్లో ఉండే ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ), క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్‌పీసీ)ల స్థానంలో జూలై ఒకటి నుంచి ప్రధాన క్రిమినల్ చట్టాలుగా ‘భారతీయ న్యాయ సంహిత’ (బీఎన్‌ఎస్), ‘భారతీయ నాగరిక్ సురక్షా సంహిత’ (బీఎన్‌ఎస్‌ఎస్)లు అమల్లోకి రానున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో కేసులు నమోదు చేసేటప్పుడు పాత ఐపీసీ, సీఆర్‌పీసీల స్థానంలో బీఎన్‌ఎస్, బీఎన్‌ఎస్‌ఎస్ చట్టాలను పేర్కొనాలని సూచించారు. ఏయే తేదీల్లో నమోదయ్యే కేసుల్లో ఎలాంటి చట్టాలను పేర్కొనాలనేది వెల్లడించారు. 

  1. * నేరం జూలై ఒకటి కంటే ముందుగా జరిగి కేసు కూడా జూలై 1 కంటే ముందుగానే జరిగితే ఐపీసీ సెక్షన్లను అమలు చేస్తూ సీఆర్‌పీసీలో పేర్కొన్న నిబంధనలను అనుసరిస్తారు.
  2. * జూలై ఒకటి కంటే ముందుగా నేరం జరిగి జూలై ఒకటి తరువాత కేసును రిజిస్టర్ చేస్తే ఐపీసీ సెక్షన్ల ప్రకారం బీఎన్‌ఎస్‌ఎస్ లో పొందుపర్చిన ప్రొసీజర్‌ను అనుసరిస్తారు.
  3. * నేరం జూలై 1న గానీ, ఆ తరువాతగానీ జరిగితే కేసు బీఎన్‌ఎస్ (భారతీయ న్యాయ సంహిత)లో పేర్కొన్న సెక్షన్లను పొందుపరుస్తూ బీఎన్‌ఎస్‌ఎస్ (భారతీయ నాగరిక్ సురక్షా సంహిత)లో పేర్కొన్న నిబంధనల ప్రకారం ముందుకు సాగుతుంది.

జూలై ఒకటి నుంచి కేసులు ఇలా..

నేరం జరిగిన తేదీ కేసు రిజిస్ట్రేషన్ ఏ చట్టంలోని నిబంధనలు ఏ చట్టంలోని 

అయ్యే తేదీ అమలు చేయాలి విధానాలను అనుసరించాలి

1 జూలై 2024కు ముందు 1జూలై 2024కు ముందు ఐపీసీ సీఆర్‌పీసీ

1 జూలై 2024కు ముందు 1జూలై 2024 తరువాత ఐపీసీ బీఎన్‌ఎస్‌ఎస్

1 జూలై 2024 నాడు/తరువాత 1జూలై 2024 నాడు/తరువాత బీఎన్‌ఎస్ బీఎన్‌ఎస్‌ఎస్