1 July, 2026 | 9:15 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

బినామీల పరం.. ఆర్టిడీయే కాంప్లెక్స్?

11-06-2025 12:47 AM

- నీరుగారుతున్న సర్కార్ లక్షం

- పేరుకుపోతున్న బకాయిలు

- చోద్యం చూస్తున్నఅధికారులు

భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 10, (విజయ క్రాంతి); విద్యావంతులైన గిరిజన యువకులకు స్వయం ఉపాధితో జీవనోపాధి కల్పిం చాలనే లక్ష్యంతో సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) నిర్మించిన షాపింగ్ కాంప్లె క్స్ లక్ష్యం నీరు గారుతోంది. గిరిజనుల కో సం కేటాయించిన దుకాణాల సముదాయం ఏళ్ల తరబడి గిరిజనేతరుల పరం అయ్యా యి.

కేటాయించిన గిరిజనులకు రాకుండా గిరిజనే తరులు భే షరతుగా వ్యాపారాలు సాగిస్తున్నారు. అంతేకాకుండా షాపింగ్ కాం ప్లెక్స్ మధ్యలో డ్రైనేజీ, మరుగుదొడ్ల సౌక ర్యం కోసం ఖాళీగా ఉన్న మున్సిపల్ స్థలాలను సైతం ఆక్రమించి షెడ్లు నిర్మించుకోవ డం, మరోవైపు హరితహారంలో పెంచిన మొక్కలను సైతం నిర్దాక్షణంగా నరికి వేస్తున్నారు. నెల నెల ఐటీడీఏ అధికారులకు కిరా యిలు చెల్లించకుండా బకాయిల పేరుకుపోయాయి. షాపులకు ఏర్పాటు చేసిన విద్యుత్ మీటర్లకు బిల్లులు కట్టక పోవడంతో విద్యుత్ బకాయిలు సైతం భారీగా పెరిగాయి.

విద్యు త్ శాఖ అధికారులు మీటర్లను డిస్కనెక్ట్ చేస్తే దొడ్డి దారిన అదే షాపుకు వేరొకరి పేరుతో మీటర్లు పొందుతున్నట్లు ఆరోపణలు కూడా లేకపోలేదు. ఈ క్రమంలో విద్యుత్ శాఖ అధికారులకు పెద్ద మొత్తంలో నజరానా ముట్ట చెబుతున్నట్లు తెలుస్తోంది. గిరిజనుల కోసం నిర్మించిన దుకాణాల సముదాయం గిరిజనేతరులు వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తు న్నారు. పేరు గిరిజనులది ఊరు గిరిజనేతరులది అన్నట్టుగా దుకాణాల సముదాయం మారిందనీ విమర్శలు వస్తున్నాయి.

ఐ టి డి ఏ అధికారులు అన్నీ తెలిసిన ఏమీ తెలియనట్లు వ్యవహరిస్తున్నారని, ఈ విషయంలో మతలకు ఏంటో ఇప్పటికే అర్థమయి  ఉం టుంది. ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి కల్పించుకొని పాల్వంచలో గిరిజనుల కోసం నిర్మిం చిన దుకాణాల సముదాయంలో చోటు చేసుకున్న అక్రమాలపై చర్యలు తీసుకోవాలని, గిరిజన యువకులకు ఉపాధి సౌకర్యం కల్పించాలని గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ విషయమై ఏటిడిఓ చంద్రమోహన్ ను వివరణ కోరగా గిరిజనేతరులు వ్యాపారం చేస్తున్న మాట వాస్తవమేనని, బ కాయిలు సైతం ఉన్నాయని, వారికి నోటీసు లు ఇచ్చిన సమాధానం ఇవ్వకుండా వ్యవహరిస్తున్నారని. విషయాన్ని ఐటీడీఏ పీవో దృష్టికి తీసుకెళ్లని ఉన్నట్టుతెలిపారు.