2 September, 2026 | 1:40 AM

ఆర్టీసీ స్థలాలు ప్రభుత్వానికిస్తే తప్పేంటి?

02-09-2026 | 12:43am
  1. ప్రభుత్వం, ఆర్టీసీ ఒక్కటేనన్న మంత్రి పొన్నం
  2. ఇందిరమ్మ ఇళ్లకు తప్పకుండా ఇస్తామని వెల్లడి

హైదరాబాద్, సెప్టెంబర్ 1 (విజయక్రాంతి): ఆర్టీసీలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నామని రవాణా శాఖ మంత్రి(Transport Minister) పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) పేర్కొన్నారు. ఆర్టీసీ స్థలాలు ప్రభుత్వానికి ఇస్తే తప్పేంటని ప్రశ్నించారు. మంగళవారం బస్ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో వెయ్యి రోజుల పాలనపై మంత్రి  మాట్లాడారు. ప్రభుత్వం, ఆర్టీసీ ఒక్కటేనని, ఆర్టీసీకి వందల ఎకరాల స్థలాలను ప్రభుత్వం ఇచ్చిందని, పేదల కోసం ఇందిరమ్మ ఇళ్ల(Indiramma houses)కు ఆర్టీసీ స్థలాలు(RTC lands) తప్పకుండా ఇస్తామని స్పష్టం చేశారు.

ఆర్టీసీలో 1500 కండక్టర్ పోస్టులు భర్తీ చేస్తామని, దాదాపు 4 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చివరి దశలో ఉందన్నారు. ఆర్టీసీలో త్వరలోనే గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో రవాణా శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి, రవాణాశాఖ కమిషనర్ ఇలంబర్తి, జేటీసీ చంద్రశేఖర్ గౌడ్, ఈడీలు సీహెచ్ వెంకన్న, ఎం.రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.