28 June, 2026 | 12:01 PM

'వాట్సాప్ చాట్‌బాట్' సేవలు ప్రారంభం: ఎస్ఈ వెల్లడి

09-05-2026 03:56 PM

నిర్మల్,(విజయక్రాంతి): తెలంగాణ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ వాట్సాప్ చిట్ పట్టు సేవలు జిల్లా విద్యుత్ శాఖ పర్యవేక్షణ ఇంజనీర్ తెలిపారు. (TGNPDCL), 18 జిల్లాల్లో 70.39 లక్షల వినియోగదారులకు  వేగవంతమైన, పారదర్శకమైన సేవలను అందిస్తున్నామన్నారు. మే 8, 2026 నుండి కృత్రిమ మేధ ఆధారిత వాట్సాప్ చాట్‌బాట్  (Artificial Intelligence) తెలిపారు. ఇందులో  వినియోగదారులు  తెలుగు, ఇంగ్లీష్ రెండు భాషలలోనూ మెసేజ్ చేసిన AI ఉపయోగించి ఆ  ప్రశ్నను అర్ధం చేసుకొని అందుకు తగట్టుగా విశ్లేషించుకుని  సమాచారాన్ని అందిస్తుందని  వివరించారు .   తమ స్వంత మాటల్లో వినియోగదారులు  తెలుగులో,  ఇంగ్లీష్ లో టైప్ చేయవచ్చని తెలిపారు.

వినియోగదారులు వాట్సాప్ చాట్‌బాట్ ద్వారా  ఈ క్రింది సేవలు పొందవచ్చు :

 1. బిల్లు విచారణ : ప్రస్తుత బిల్లు మొత్తం మరియు చెల్లింపు తేదీ 

2. చెల్లింపు స్థితి : వినియోగదారులు చెల్లించిన రికార్డు  తెలుసుకోవచ్చు 

3. ఫిర్యాదు నమోదు : తెలుగు, ఇంగ్లీష్ రెండు భాషలలోనూ వివరాలు తీసుకుంటుంది.  వినియోగదారునికి ఫిర్యాదు  టికెట్ ఇస్తుంది. 

4. ఫిర్యాదు  టికెట్ :   టికెట్ నంబర్ ద్వారా మరల ఏ ఫిర్యాదు స్థితినైనా తెలుసుకోవచ్చు. 

5. అంతరాయ సమాచారం : వినియోగదారు సేవా ప్రాంతంలో ప్రస్తుత అంతరాయ స్థితిగతులను తెలుసుకోవచ్బు 

6. టిజిఎన్పీడీసీఎల్ హెల్ప్ లైన్ : చాట్‌బాట్‌కు సమాధానం చెప్పలేని ,  పరిష్కరించలేని సమస్య వచ్చినప్పుడు వినియోగదారునిని  ఏజెంట్‌కు తరలించి పరిష్కరించబడతాయి.  

ఈ వాట్సాప్ చాట్‌బాట్ సేవలు  వినియోగదారులకు  24×7  అందుబాటులో సేవలు కొనసాగుతాయని ,  రైతులకు అర్థమయ్యే విధంగా  తెలుగు భాషా లో  అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు .  విద్యుత్ బిల్లుల పూర్తి సమాచారం, బిల్లుల  విచారణలు, చెల్లింపుల స్థితి సెకన్లలో పరిష్కరించబడతాయన్నారు.  కాల్ వేటింగ్  టైమ్ ఉండదని , ఏజెంట్ క్యూ కూడా లేదని , మెను నావిగేషన్ ఉంటదన్నారు. 

తమ మొబైల్‌లో 8712481489 ద్వారా వాట్సాప్‌లోకి వెళ్లి “ కావలసిన సేవలను సులభంగా పొందవచ్చన్నారు   ఈ సేవలను నేరుగా యాక్సెస్ చేయడానికి https://wa.me/918712481489 లింక్ పై క్లిక్ చేయవచ్చన్నారు. వినియోగదారులు తమ మొబైల్ ద్వారా ఇంట్లోనే కూర్చుని ఈ వాట్సాప్ చాట్‌బాట్ సద్వినియోగం చేసుకోవాలని ఎస్.ఈ కోరారు. టీజీఎన్పీడీసీఎల్ ఎప్పటికప్పుడు నాణ్యమైన సేవలు అందించడంలో ఈ వాట్సాప్ చాట్‌బాట్ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన స్పష్టం చేశారు.