దివ్యాంగురాలికి వీల్ ఛైర్ అందజేత
తిరుమలగిరి సాగర్, మే 9: తిరుమలగిరి సాగర్ మండలం గట్టుమీదతండ లో దివ్యాంగురాలైన అంగో తు సుశీల రెండు కాళ్ళు సహకరించకపోవడం వలన రెండు కర్రల సహాయంతో నడుస్తున్న విషయాన్ని తెలుసుకొని ఏకే ఫౌండేషన్ చైర్మన్, హైకోర్టు న్యాయవాది కట్టెబోయిన అనిల్ కుమార్ వీల్ చైర్ అందజే శారు.
ఆ తండాకు వెళ్ళి స్వయంగా తన చేతుల మీదు గా దివ్యాంగురాలుకి వీల్ ఛైర్ అందించారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా ఏకే ఫౌండేషన్ ద్వారా గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో విన్నుత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.
ముఖ్యంగా దివ్యాంగులకి వీల్ ఛైర్ పంపిణీ కార్యక్రమంతోపాటు విద్య, ఉపాధి వంటి వాటిపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అనిల్ నాయక్, హరి నాయక్, తిమ్మాపూరం మాజీ ఉప సర్పంచ్ తుమ్మరగోటి రమేష్, సాయి నాయక్, చందు నాయక్, సేవా నాయక్, నరేష్ నాయక్, మన్నెం కోటి, రావుల రాము యాదవ్, మేకల శివ యాదవ్, గంగుల అంజి యాదవ్, శేఖర్ గౌడ్, పోలేపల్లి శివ, ప్రజా ప్రతినిధులు, మహిళ సంఘం నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.






