24 April, 2026 | 12:20 PM

Breaking News

BJP కార్యాలయానికి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి.. త్వరలోనే బీజేపీలోకి?   •   అడవికి వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్రగాయాలు   •   కోనరావుపేటలో ఘనంగా పీఎం శ్రీ ఎంపీపీ ఎస్ ప్రైమరీ స్కూల్ 2వ వార్షికోత్సవం – గ్రాడ్యుయేషన్ డే వేడుకలు   •   కమిటీల పేరుతో కాలయాపన: 900 రోజులైనా— హామీల అమలు ఏమైంది?   •   సివిల్ ఇంజినీర్స్ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం   •   రోడ్లపైకి ఆర్టీసీ కార్మికులు..!   •   అక్రమ రేషన్ బియ్యం స్వాధీనం   •   చర్చలు ప్రారంభం.. హామీలు అమలు చేయాలని ఆర్టీసీ జేఏసీ డిమాండ్   •   ఆవేశంలో అఘాయిత్యాలకు పాల్పడవద్దు.. ఆర్టీసీ కార్మికులకు మంత్రి పొన్నం విజ్ఞప్తి   •   సమస్యలకు ఆత్మహత్యలు పరిష్కారం కాదు: RTC డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి పట్ల మహేష్ గౌడ్ దిగ్భ్రాంతి   •  

ఫిరాయింపుల కట్టడి ఎప్పుడు?

14-07-2024 12:00 AM

బీఆర్‌ఎస్ టికెట్‌పై పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడి అధికార కాంగ్రెస్‌లో చేరుతుండడం చూస్తే ఎన్నికలకు అర్థం లేదనిపిస్తుంది. ‘ఇంతకు ముందు మా పార్టీ వాళ్లను కేసీఆర్ చేర్చుకున్నప్పుడు లేని తప్పు ఇప్పుడు మేము చేర్చుకుంటే తప్పా?’ అని కాంగ్రెస్ నేతలు అడుగుతున్నారు. ఎవరు చేసినా తప్పు తప్పే. అధికారం లేకపోతే తాము ఉత్సవ విగ్రహాలుగా మారుతామన్న భయంతో ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తున్నారు.  కానీ, ఇలా పార్టీ ఫిరాయించిన వారిని ప్రజలు ఆదరిస్తారా అన్న విషయాన్ని వారు విస్మరిస్తున్నారు. ఓటర్లు కూడా డబ్బుకు అమ్ముడు పోతున్న ఈ రోజుల్లో నైతిక విలువలు, పార్టీ సిద్ధాంతాల గురించి మాట్లాడడం శుద్ధ దండగ అనిపిస్తుంది. కానీ, ఈ ఫిరాయింపుల జాడ్యం సమాజాన్ని తినేస్తుందనే వాస్తవాన్ని అందరూ గుర్తుంచుకోవాలి.

 బి.సుబ్రహ్మణ్య శర్మ, హైదరాబాద్