దేశానికి చక్రవర్తులమనే భావనలో మోదీ, అమిత్ షా
సొంత చెల్లినే బయటకు గెంటేసిన చరిత్ర కేటీఆర్ ది
హనుమకొండ: వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో SIRపై బీఎల్ఏలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్(TPCC Mahesh Kumar Goud) ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) పై బీఎల్ఏల శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ మాట్లాడుతూ... మీనాక్షి నటరాజన్ నామినేషన్(Meenakshi Natarajan Nomination) తిరస్కరించారు.. రాజ్యసభలో బీజేపీ నేతలను(BJP leaders) ప్రశ్నిస్తుందనే నామినేషన్ తిరస్కరించారని తెలిపారు. దేశంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగానికి విలువ లేకుండా చేశారని చెప్పారు. దేశానికి చక్రవర్తులమనే భావనలో ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi), అమీత్ షా ఉన్నారని విమర్శించారు.
పదేళ్లు దోపిడీ చేసి.. ఇప్పుడు కేటీఆర్(Kalvakuntla Taraka Rama Rao) అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ దోపిడీని ప్రజలు మరిచిపోయారని కేటీఆర్ అనుకుంటున్నారని సూచించారు. కేటీఆర్ ఎన్ని మాయమాటలు చెప్పినా.. ప్రజలు వినే పరిస్థితి లేదన్నారు. ఆస్తి కోసం సొంత చెల్లినే బయటకు గెంటేసిన చరిత్ర కేటీఆర్ ది అని మహేశ్ గౌడ్( Mahesh Kumar Goud) ఆగ్రహం వ్యక్తం చేశారు. చెల్లిని గెంటేసి.. ఇప్పుడు తెలంగాణ ఆడబిడ్డల గురించి కేటీఆర్ మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాళా తీయించారని వివరించారు. అధికారం పోయిందనే అక్కసు కేటీఆర్ లో కనిపిస్తోందన్నారు. ప్రజా పాలనలో అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లలా చూస్తున్నామని పేర్కొన్నారు.






