calender_icon.png 13 December, 2025 | 4:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రచారం ముగిసే.. ప్రలోభాలు మిగిలే?

10-12-2025 01:52:25 AM

  1. మొదటి విడత ఎన్నికల ప్రచారానికి ప్రచారం ముగింపు
  2. ఎన్నికల నిర్వహణపై జిల్లా యంత్రాంగం దృష్టి

నిర్మల్, డిసెంబర్ 9 (విజయక్రాంతి): గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మొద టి విడత ఎన్నికల ప్రచారానికి మంగళవారం స్థిరపడింది. నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ నిర్మల్ డివిజన్లోని ఏడు మండలాలకు గ్రామపంచాయతీ ఎన్నికల మొదటి దశ ఎన్నికల పోలింగ్ ఈనెల 11న జరగనుంది. మొత్తం 131 గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరగను నేపథ్యంలో పోటీ చేస్తే అభ్యర్థులు గెరిపే లక్ష్యంగా ఎన్నికల ప్రచారాన్ని నువ్వా నేనా అనే రీతిలో తమ గుర్తులను ఓటర్లకు వివరించి ప్రజలకు ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు సాగించారు.

ప్రలోభాలకు అంతా రెడీ

నిర్మల్ జిల్లాలు జరుగుతున్న గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మొదటి దశ ఎన్నికల ప్రచారం ముగియడంతో వివిధ పార్టీల మద్దతుదారులు స్వతంత్ర అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఇప్పటివరకు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

బహిరంగ ప్రచారం ముయ్యడంతో అభ్యర్థులంతా ఇప్పుడు ఇంటింటికి వెళ్లి తమకు ఓట్లు వేస్తే తాయిలాలను ప్రకటించేందుకు సిద్ధం చేసుకున్నారు తటస్థంగా ఉన్న ఓటర్ల పై లెక్కలు వేసుకొని ఓట్లను కొనుగోలు చేసేందుకు కొందరు నేతలు ఇప్పటికి అన్ని ఏర్పాట్లు చేశారు మద్యం మని ఇతర ప్రలోభాలకు ఓటర్లు లొంగదీసుకునే విధంగా లక్షల  రూపాయలను ఖర్చు చేస్తున్నారు

ఆరు మండలాల్లో నిషేధాజ్ఞలు.. 

జిల్లాలో ఈనెల పదకొండవ తేదీన (గురువారం) జరగనున్న తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా, ఎన్నికల ప్రచారంపై అధికారులు కీలక ఆదేశాలు జారీ చేశారు. తొలి విడత ఎన్నికలు జరిగే ఆరు మండలాలు అయిన దస్తురాబాద్, ఖానాపూర్, పెంబి, కడెం, లక్ష్మణచందా, మామడల పరిధిలో నేటి సాయంత్రం ఐదు గంటల (17:00 గం.లు) వరకు తప్పనిసరిగా అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముగించాలని స్పష్టం చేశారు. గడువు ముగిసిన తర్వాత బహిరంగ ప్రచారానికి అనుమతి ఉండదు.

నిషేధాజ్ఞల అమలు: ఎన్నికల సజావుగా నిర్వహణ కోసం ఇప్పటికే ఈ ఆరు మండలాల్లో నిషేధాజ్ఞలు ఈరోజు సాయంత్రం 5 గంటల నుండి (సెక్షన్ 163 BNSS) అమలులోకి వస్తాయి. ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడటం నిషేధం.

మద్యం దుకాణాలు బంద్: ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి పోలింగ్ మరియు ఓట్ల లెక్కింపు ముగిసే వరకు ఈ ప్రాంతాలలో అన్ని మద్యం దుకాణాలను మూసివేయాలని అధికారులు ఆదేశించారు. కాగా మొదటి దశ గ్రామ పంచాయతీ ఎన్నికలను 11వ తేదీ, గురువారం ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించబడుతుంది. పోలింగ్ ముగిసిన అనంతరం, అదే రోజు (డిసెంబర్ 11 నాడు) సాయంత్రం ఓట్లను లెక్కించి, ఫలితాల వెల్లడి జరుగుతుంది.

ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలి: ఎస్పీ జానకీ

జిల్లా లో జరుగుతున్న గ్రామపంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్మించుకోవాలని జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. మంగళవారం ఆయా పోలీస్ స్టేషన్ అధికారులతో మొదటి రెండో విడత మూడో విడత ఎన్నికల నిర్వహణ పోలీసు బందోబస్తు శాంతి భద్రతల పర్యవేక్షణ అక్రమ మద్యం డబ్బు పంపకాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఎన్నికలను ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహించు కునేలా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని భయభ్రాంతులకు గురిచేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది ఉన్నారు

ప్రశాంతంగా ఎన్నికలు జరుపుకోవాలి: కలెక్టర్ 

నిర్మల్ జిల్లాలో మొదటి దశ గ్రామపంచాయతీ ఎన్నికలను ప్రజలు ప్రశాం త వాతావరణంలో ప్రజాస్వామ్య పరిధిలో జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. ఎన్నికల పోలింగ్కు అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. ఓటర్లు ఆయా పోలింగ్ కేంద్రాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.