calender_icon.png 15 December, 2025 | 7:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుటుంబంలో పంచాయతీ చిచ్చు

10-12-2025 01:56:00 AM

  1. సర్పంచ్ స్థానానికి అత్తా కోడళ్ల పోటీ... 
  2. పదవీ కోసం ప్రత్యర్థులుగా మారిన అన్నదమ్ములు...
  3. జిల్లా పంచాయతీ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు...

ఆదిలాబాద్, డిసెంబర్ 9 (విజయక్రాంతి): జిల్లాలో జరుగుతున్న పంచాయితీ ఎన్నికలు కొన్ని కుటుంబంలో చిచ్చు రాజేస్తున్నాయి. పల్లెల్లో జరుగుతున్న పంచాయతీ పోరులో చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటున్నారు. కుటుంబ సభ్యులు బంధాలను... బంధుత్వా లను సైతం లెక్క చేయకుండా ఎన్నికలో ఒక రిపై మరొకరు తలపడుతున్నారు. గెలుపుపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తూ ముమ్మరం గా ప్రచారం చేపడుతున్నారు.

కొన్ని గ్రామాల్లో అన్నా తమ్ముళ్లు తలపడిటే, మరొక చోట తోడి కోడళ్లు, ఇంకో చోట ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు పోటి పడుతున్నారు. ఐతే ఇదే తరహా లో ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలో మాత్రం ఒకే కుటుంబానికి చెందిన అత్తా కోడళ్లు సర్పంచ్ స్థానాకి పోటి పడుతుండటం, మరోవైపు సర్పంచ్ పదవి కోసం ముగ్గురు అన్నదమ్ములు ప్రత్యర్థులుగా మారడం లాంటి ఘటనలు ప్రాధాన్యతను సంతరించున్నాయి.

గెలుపు నాదంటే నాదని ధీమా వ్యక్తం చేస్తున్న ఆ అత్తా కోడళ్లు ఎవరు, ఆ ముగ్గురు అన్న దమ్ములు ఎవరు... ఆ గ్రామాల్లో పంచాయతీ నెలకొందో తెలియాలంటే ఈ స్టోరీ పూర్తిగా చదవాల్సిందే... 

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లీ మండలం లోని మారుమూల గ్రామ పంచాయతీ అది. ఆ గ్రామం పేరే హీరాపూర్....  దీన్నే వాల్గొండ హీరాపూర్ అని కూడా పిలుస్తారు. ఈ హీరా పూర్ గ్రామ పంచాయతీకి తొలి విడత పం చాయతీ ఎన్నికల్లో భాగంగా ఈనెల 11న పోలీంగ్ జరుగనుంది. అయితే ఈ హీరాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో సుమారు ఏడు గిరిజన గ్రామాలు ఉన్నాయి. 1,200 మంది దాకా ఓటర్లు ఉన్నారు.

ఈ సర్పంచ్ స్థానం కోసం ప్రస్తుతం నలుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. అందులో ఇద్దరు ఒకే కుటుంబానికి చెందిన అత్తా కోడళ్లు పోటీ పడటం విశేషం. అయితే ఈ గ్రామ పంచాయతీ ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు ప్రయత్నం చేసినప్పటికి పోటి నుండి తప్పుకునేందుకు ఎవరు అంగీక రించకపోవడంతో పోటి అనివార్యమైంది. కాగా ఇప్పటి వరకు ఈ హీరాపూర్ గ్రామ పంచాయతీ కి పురుషులే సర్పంచ్ లుగా కొనసాగుతూ వచ్చారు.

అయితే ఈసారి ఈ స్థానాన్ని మహిళలకు రిజర్వు చేశారు. దీంతో మహిళా అభ్యర్థులు రంగంలో దిగారు. వీరిలో హిరాపూర్ గ్రామానికి చెందిన అత్తా తొడసం లక్ష్మీబాయి, కోడలు తొడసం మహేశ్వరి ఉన్నా రు. గెలుపు ధీమాతో ఎవరికి వారు ప్రచారాన్ని సైతం సాగిస్తున్నారు. కాగా పంచాయతీ పరిధిలో ప్రజలతో తనకు పరిచయం ఉందని, తాను చదువుకోలేకపోయిన, తన తెలివి తేటలు, ఆలోచనలతో పనిచేసి పంచాయతీ అభివృద్దికి పాటుపడతానని అత్త తొడసం లక్ష్మీబాయి చెబుతున్నారు. 

మరోవైపు తాను విద్యావంతురాలినని, ప్రజలు తనకే పట్టంకడతారని కోడలు తొడసం మహేశ్వరి ధీమా వ్యక్తం చేస్తున్నారు. తాను ఇంటర్ ఐటిఐ చదువుకొని ఉద్యోగం కోసం ప్రయత్నించినా ఉద్యోగం రాలేదని, ఈ సారి పంచాయతీ ఎన్నికల్లో మహిళకు అవకాశం రావడంతో ఈ హిరాపూర్ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ గా పోటీకి సిద్ధమయ్యానని చెప్పుకొచ్చారు. 

అదేవిధంగా ఇంద్రవెల్లి మండలంలోని ఏమాయికుంటా గ్రామానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు జాదవ్ కుబేర్ సింగ్, జాదవ్ లఖన్ సింగ్, జాదవ్ అనార్ సింగ్ సర్పంచ్ స్థానంపై ఆసక్తి పెట్టుకొని పోటా పోటీగా నామినేషన్లు దాఖలు చేశారు. జాదవ్ లఖన్ సింగ్ ఇప్పటికే గత ఎన్నికల్లో సర్పంచ్ గా గెలుపొందారు. ముగ్గురు అన్నదమ్ముము పోటీలో ఉన్న మాట వాస్తవమేనని చెప్పుకొ చ్చారు.

గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి, గ్రామ రూపు రేఖలను మార్చడానికి సర్పంచ్ పోటీల్లో నిల్చామని  ముగ్గురు స్పష్టం చేశారు. మొత్తానికి ఆదిలాబాద్ జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న  ఏజెన్సీ గ్రామ పంచాయతీల్లో కొత్త విచిత్రాలు నెలకొన్న హీరాపూర్, ఏమాయికుంటా పంచాయతీలు ఉన్నాయి.

అయితే ఈ పంచాయతీ నుండి ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అత్తా కోడళ్లు, ముగ్గురు అన్నదమ్ములు పోటి పడుతుండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది. మరీ ఈ ఎన్నికల్లో గెలుపు అత్తను వరిస్తుందా లేక కోడలిని వరిస్తుందా, అదేవిధంగా ముగ్గురు అన్నదమ్ముల్లో సర్పంచ్ గా ఎవరికి గెలుస్తారో తెలియాలంటే ఇంకా కొద్ది రోజులు వేచి చూడాల్సిందే

కుబీర్ మండలంలో ముగ్గురు సర్పంచులు ఏకగ్రీవం

కుబీర్, డిసెంబర్ 9 (విజయక్రాంతి): కుబీర్ మండలంలో ముగ్గురు సర్పంచు లు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు అధికారులు ప్రకటించారు. మండలంలోని జామ్గామ్ సర్పంచ్ గా నవనీత ఉపసర్పంచ్గా రాజేశ్వర్,, పలిసి తండా సర్పంచ్గా అర్జున్, బ్రహ్మేశ్వర్ తండ సర్పంచ్‌గా రాథోడ్ రేఖా బాయ్ సర్పంచులుగా ఎన్నికైనట్టు ఆయన తెలిపారుంగా ఎన్నికల స్థాపించలకు మండల అభివృద్ధి అధికారి సాగర్ రెడ్డి అభినందించారు.