ఇంకెప్పుడు కొంటారు.. మొలకలొచ్చాయి?
22-05-2024 02:28 AM
సిద్దిపేట రూరల్, మే 21 (విజయక్రాంతి) : ఇటీవల కురిసిన అకాల వర్షంతో రైతులకు మళ్లీ అవస్థలు తప్పలేవానే చెప్పాలి. మంగళవారం సిద్దిపేట రూరల్ మండలంలోని పెద్దలింగారెడ్డిపల్లి, పుల్లూరు, నారాయణరావుపేట మండల కేంద్రంల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కుప్పలు కుప్పలుగా దర్శనమిచ్చాయి. అంతేకాకుండా తడిసి మొల కెత్తిన ధాన్యం చూసుకుంటూ సదరు రైతు లు ఒక్కసారిగా బిక్కుబిక్కుమంటూ దిగాలుతో కనిపించారు. ఈ సందర్భంగా రైతు లు మాట్లాడుతూ ఉన్నపాటున కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం మెలక లొచ్చాయి.. ఇంకెప్పుడు కొనుగోలు చేస్తారని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కొనుగోళ్లు వేగం పెంచేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.






