23 August, 2026 | 2:31 AM

సంగారెడ్డిలో మామిడి పండ్ల మేళా

22-05-2024 02:28 AM

ఫల పరిశోధన కేంద్రంలో పలు రకాల మామిడి పండ్లు

సంగారెడ్డి టౌన్, మే 21 : రైతులకు మామిడి తోటల సాగుపై అవగాహన కల్పించేందుకు మ్యాంగో మేళ నిర్వహిస్తున్నామని సంగారెడ్డి ఫల పరిశోధన కేంద్రం ప్రధాన శాస్తవేత్త డాక్టర్ సుచిత్ర తెలిపారు. మంగళవారం సంగారెడ్డి పట్టణంలోని మామిడి పరిశోధన కేంద్రం (ఎఫ్‌ఆర్‌ఎస్)లో మామిడి పండ్ల ప్రదర్శన నిర్వహించారు. పరిశోధన కేంద్రంలో మామిడి చెట్లకు ఉన్న పండ్లను ప్రదర్శనలో ఉంచారు. ఫల పరిశోధన కేంద్రంలో 400పైగా రకాలను పెంచు తున్నట్లు వారు తెలిపారు. రైతులకు అవసరమైన మామిడి మొక్క లు అందించేందుకు నర్సరీలో మొకలు పెంచుతున్నామని తెలిపారు.