మనసంతా పులకించగా.. ఆనందోత్సాహాల మధ్య
- శ్రీ వేణుగోపాల స్వామి చక్రస్నానం వేడుకలు
పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు
సుల్తానాబాద్ , మార్చి 1 (విజయ క్రాంతి): మనసంతా పులకించగా... ఆనందోత్సవాల మధ్య శ్రీ వేణుగోపాలస్వామి చక్ర స్నానం వేడుకలు అంగరంగ వైభవంగా, క న్నుల పండువగ జరిగాయి, పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని శ్రీ వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివా రం మధ్యాహ్నం శ్రీ వేణుగోపాల స్వామి రథయాత్ర గుడిమిట్టపల్లి శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం వరకు కొనసాగింది, అ క్కడ శ్రీ వేణుగోపాలస్వామి చక్రస్నానం వేడుకలు వైభవంగా జరిగాయి, పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు శ్రీ వేణుగోపాలస్వామి ఉత్సవ విగ్రహాన్ని ఎత్తుకొని నృత్యాలు చేశా రు,
మహిళల ఆటలు, పాటలు ఎంతగానో ఆకట్టుకున్నాయి, అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు, అంతకుముందు శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం లో హోమం తో పాటు పలు పూజా కార్యక్రమాలు జరిగాయి, దేవాలయ చైర్మన్ పల్లా మురళీధర్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు వైభవంగా జరిగాయి, అర్చకులు సౌమిత్రి శ్రావణ్ కుమార్, వేణుమాధవ్ , ఆరుట్ల రంగాచార్యులు, ఆరుట్ల శ్రీనివాస్ చార్యులు,
కోరుకొండ వరద రాజులు, కో వెల వెంకట చార్యులు, వినయ్ త్రిపాఠి, పోలస అశోక్ లు ప్రత్యేక పూజలు చేశారు, ఈ కార్యక్రమం లో జిల్లా గ్రంధాలయ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్ , సుల్తానాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ బిరుదు రాధా కృష్ణ , వైస్ చైర్ పర్సన్ అంతటి పుష్పలత, కౌన్సిలర్ కందునురి సమతా కుమార్, శ్రీ శివాలయం చైర్మన్ అల్లంకి సత్యనారాయణ, పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కొమురవెల్లి భాస్కర్,
పట్టణ మహిళా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షురాలు బాదం వాణి , ఆర్యవైశ్య సంఘం జిల్లా కార్యదర్శి అల్లంకి లింగ మూర్తి, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పల్లా శ్రీనివాస్ (వాసు), కొమురవెల్లి శ్రీకాంత్, కొమురవెల్లి (కేబి) శ్రీనివాస్, పల్లా శరత్ , పల్ల అనిల్, పల్ల సురేష్ , పుల్లూరి రమేష్ తో పాటు ఆర్యవైశ్య సంఘం ప్రముఖులు, ఇతర నాయకులు , పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.




