టాప్ లేపేది ఎవరో?
- గుజరాత్‌తో సన్‌రైజర్స్ ఢీ
- గెలిచిన జట్టుకు అగ్రస్థానం
- అహ్మదాబాద్‌లో పరుగుల వరదే
అహ్మదాబాద్, మే 11 : ఐపీఎల్ 19వ సీ జన్‌లో సెకండాఫ్ చివరి దశలో ఉంది. ఇప్పటికే టోర్నీ నుంచి రెండు జట్లు ఇంటిదారి పట్టగా ప్లే ఆఫ్ రేసులో 8 జట్లు నిలిచాయి. ప్రస్తుతం ప్లే ఆఫ్ బెర్తుల కోసం పోటీ ఆసక్తికరంగా మారిన వరుస విజయాలతో జోరు మీదున్న సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ తలపడబోతున్నాయి. అహ్మదాబాద్ నరేంద్రమోదీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు టాప్ ప్లేస్‌కు దూసుకెళుతుంది.
ప్రస్తు తం పాయింట్ల పట్టికలో సన్‌రైజర్స్ హైదరాబాద్ రెండో స్థానంలో ఉంది. ఇప్పటి వర కూ 11 మ్యాచ్‌లు ఆడిన ఆరెంజ్ ఆర్మీ ఏడింటిలో గెలిచింది. వరుసగా ఐదు మ్యాచ్‌లు గె లిచిన తర్వాత హోంగ్రౌండ్‌లో కోల్‌కతాపై ఓడిపోవడం షాక్‌కు గురిచేసింది. అయితే తర్వాతి మ్యాచ్‌లో పటిష్టమైన పంజాబ్ కిం గ్స్‌ను చిత్తు చేసింది. బ్యాటింగ్‌లో అందరూ ఫామ్‌లోకి రావడం సన్‌రైజర్స్ విజయాలకు కారణంగా చెప్పొచ్చు. ముఖ్యంగా క్లాసెన్ అద్భుతంగా రాణిస్తున్నాడు.
దాదాపు ప్రతీ మ్యాచ్‌లోనూ కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. 11 మ్యాచ్‌లలో 494 పరుగులతో ఆరెంజ్ క్యాప్ క్లాసెన్ తోనే ఉంది. అభిషేక్ శర్మ ఈ జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. అటు బౌలింగ్‌లో ప్యాట్ కమిన్స్ వచ్చిన తర్వాత సన్ రైజ ర్స్ మరింత పుంజుకుంది. కమిన్స్ రాకముం దే యువ బౌలర్లు కొన్ని మ్యాచ్‌లలో అదరగొట్టారు. సాకిబ్ హొస్సేన్, ఎహసాన్ మలింగ, శివాంగ్ కు మార్, హర్ష దూబే రాణిస్తున్నారు. మరోవైపు గుజరాత్ టైటాన్స్ కూడా మంచి ఫా మ్‌లో ఉంది.
ఆరంభంలో తడబడినా తర్వా త కమ్‌బ్యాక్ ఇచ్చింది. వరుసగా నాలుగు విజయాలతో టాప్ 4లోకి దూసుకొచ్చింది. చెన్నై, బెంగళూరు, పంజాబ్, రాజస్థాన్ జట్లపై అదిరిపోయే ఆటతీరుతో విజయాలను అందుకుంది. బ్యాటింగ్‌లో గుజరాత్ కీలక ఆటగాళ్ళందరూ ఫామ్‌లో ఉన్నారు. అటు బౌలింగ్‌లో సైతం గుజరాత్ అదరగొడుతోంది. రబాడ, సిరాజ్‌తో పాటు జాసన్ హోల్డర్ కీలక సమయాల్లో స్పిన్ విభాగంలో రషీద్ ఖాన్ సెకండాఫ్‌లో తన మ్యాజిక్ చూపిస్తున్నాడు.
తుది జట్లు అంచనా
గుజరాత్ టైటాన్స్ : శుభ్‌మన్ గిల్(కెప్టెన్), సాయి సుదర్శన్, బట్లర్, వాషింగ్టన్ సుందర్, హోల్డర్, షారూఖ్ ఖాన్, తెవాటియా, రషీద్ ఖాన్, మానవ్ సుతార్, రబాడ, సిరాజ్
సన్‌రైజర్స్ హైదరాబాద్ : అభిషేక్ శర్మ, హెడ్, ఇషాన్ కిషన్, క్లాసెన్, నితీశ్ రెడ్డి, సలీల్ అరోరా, అనికేత్ వర్మ, కమిన్స్(కెప్టెన్), శివాంగ్ కుమార్, మలింగ, హొస్సేన్






