12 May, 2026 | 2:26 AM

మిడిల్ ఫింగర్ చూపిన టిమ్ డేవిడ్

12-05-2026 12:58 AM
  1. మ్యాచ్ ఫీజులో 30 శాతం కోత
  2. రెండు డీమెరిట్ పాయింట్లు కేటాయింపు

ముంబై, మే 11 : ఐపీఎల్ 2026 సీజన్ ఆదివారం ఆర్సీబీ, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ థ్రిల్లర్‌ను తలపించింది. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ పోరులో ఆర్సీబీ 2 వికెట్ల తేడాతో గెలిచింది.  ఈ నేపథ్యంలో ఆర్సీబీ ఆటగాళ్లు సంబరాలు చేసు కున్నారు. అయితే టిమ్ డేవిడ్ మాత్రం అనైతిక చర్యకు పాల్పడ్డాడు. ముంబై ఇండి య న్స్ ఓటమిని వెక్కిరిస్తూ టిమ్ డేవిడ్ ఆ జట్టు కు మిడిల్ ఫింగర్ చూపించడం కెమెరాలకు చిక్కింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా టిమ్ డేవిడ్ చర్యను తీవ్రంగా పరిగణించిన బీసీసీఐ అతని మ్యాచ్ ఫీజులో 30 శాతం కోత విధించడంతో పాటు రెండు డీమెరిట్ పా యింట్లు కేటాయించింది.

ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టికల్ 2.6 ప్రకారం అనుమతి లే కుండా ఒక జట్టు లేదా వ్యక్తిని ఉద్దేశించి అసభ్యకరమైన సంజ్ఞ చేయడం నిబంధనలకు విరుద్ధమనీ, ఉల్లంఘన చర్య కింద అతడిపై చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొంది. ఆ సం జ్ఞ అసభ్యకరంగా ఉండడంతో పాటు వ్యక్తి లేదా జట్టును ఉద్దేశపూర్వకంగా అవమా నించడం కిందకు వస్తుంనీ, అందుకే అతడి మ్యాచ్ ఫీజులో జరిమానా విధించడంతో పాటు డీమెరిట్ పాయింట్లు కేటాయించామని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది.

టి మ్ డేవిడ్ ఆర్సీబీలోకి రాకముందు ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 2022 నుంచి 2024 వరకు ముంబై తరఫున ఆడాడు. 2025 సీజన్‌కు ముందు ఆర్సీ బీలోకి వచ్చిన టిమ్ డేవిడ్ ఆ జట్టు తొలి ఐపీఎల్ టైటిల్ నెగ్గడంలో కీలకపాత్ర పోషించాడు. ఇదిలా ఉంటే అంతకుముందు ముం బై ఇండియన్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లోనూ టిమ్ డేవిడ్ వివాదంలో చిక్కుకు న్నాడు. బీసీసీఐ 25 శాతం జరిమానా, డీమెరిట్ పాయింట్ విధించింది.