9 August, 2026 | 3:35 AM

ఇరువురు భామలు మోజు పడే ఆ ఒక్కడు ఎవరు?!

09-08-2026 01:19 AM

భారతీయ సినీ పరిశ్రమలో మరో క్రేజీ కాంబినేషన్‌కు తెరలేచింది. టాలీవుడ్‌లో తన డ్యాన్సులు, నటనతో యువతను ఉర్రూతలూగించిన ‘ధమాకా’ బ్యూటీ శ్రీలీల, బాలీవుడ్ స్టార్ కిడ్ జాన్వీ కపూర్ కలిసి ఒకే తెరను పంచుకోబోతోంది. బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థల కలయికలో ఓ భారీ రొమాంటిక్ థ్రిల్లర్ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో జాన్వీ, శ్రీలీల ప్రధాన పాత్రలు పోషిస్తున్నట్టు చిత్రబృందం అధికారికంగా వెల్లడించింది.

తో కూడి ఉంటాయని టాలీవుడ్ టాక్. కథ ప్రకారం.. జాన్వీ కపూర్, శ్రీలీల ఇద్దరూ ఒకే అబ్బాయిని ప్రాణంగా ప్రేమిస్తారు. ఆ అబ్బాయిపై ఇద్దరికీ సైకో అబ్సెషన్ ఏర్పడుతుంది. అతను తనకంటే తనకే దక్కాలనే స్వార్థంతో ఉంటారు. దీంతో ఇద్దరి మధ్య తీవ్రమైన ఈర్ష్య, ద్వేషం పెరుగుతాయి. ఒకరినొకరు ఓడించుకోవడానికి, సదరు యువకుడి దృష్టిని ఆకర్షించడానికి ఏ స్థాయికైనా తెగించే ‘డార్‌ెే్కఅబ్సెసివ్’ క్యారెక్టర్లలో కనిపించనున్నారు జాన్వీ, శ్రీలీల. తీవ్రమైన ఉద్వేగాలు, ఊహించని మలుపులతో వీరి పాత్రలు సాగుతాయి.

అయితే, ఈ చిత్రంలో ఈ ఇద్దరు క్రేజీ భామలు లాక్ అయినప్పటికీ, వారు అంతగా ఆరాధించే ఆ ప్రధాన పురుష పాత్ర కోసం బాలీవుడ్‌కు చెందిన కొందరు ప్రముఖ యువ హీరోల పేర్లను పరిశీలిస్తున్నారు. హీరో ఎవరనేది తేలితే ఈ ప్రాజెక్టుపై మరింత స్పష్టత రానుంది. ‘పగ్‌లైట్’ ఫేమ్ ఉమేశ్ బిస్ట్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఏక్తా కపూర్, గునీత్ మోంగా నిర్మిస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్ లేదా నవంబర్ నెలలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

ఈ లోగా హీరో ఎంపిక , ప్రీ-ప్రొడక్షన్ పనులను పూర్తి చేయాలని భావిస్తున్నారు. జాన్వీ, శ్రీలీల అద్భుతమైన డ్యాన్సర్లు కావడంతో ఈ చిత్రంలో వీరిద్దరి మధ్య వచ్చే పాటలు, నటన పరంగా వచ్చే పవర్‌ఫుల్ సీన్స్ బాక్సాఫీస్ రికార్డులు సృష్టిస్తాయనేది విశ్లేషకుల భావన.