calender_icon.png 20 February, 2026 | 12:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దీపం బాధ ఎవరికి తెలుసు?

16-02-2026 12:00:00 AM

రాత్రి, కలలొచ్చి, కన్నీళ్లొచ్చి

ఆలోచనలు తుఫాన్లను ఎదుర్కొంటాయి

ఆశలు కొన్ని, ఆశయాలు కొన్ని 

సుడిగాలిలో చిక్కుకుపోతాయి


ఎగిరిపోయిన వాటిని 

పగిలిపోయిన వాటిని 

నలిగిపోయిన వాటిని 

ఉదయాన్నే,ఏరి ఏరి తుడిచి పెడతాను 


చెదిరిపోయిన వాటిని 

విరిగిపోయిన వాటిని 

కూలిపోయిన వాటిని 

దగ్గర చేర్చి దులిపి పెడతాను


దుఃఖం నిండిన కళ్ల తెరను 

రాత్రంతా కాలుతున్న దీపం బాధను

అర్థం చేసుకొనే వాళ్లెవరు

బీటలు బారిన గోడలను 

అద్దం మోసే పగుళ్లను 

దగ్గరగా వెళ్లి చదివే వాళ్లెవరు ?


ఓపిక పట్టాలి, అన్ని హింసలు భరించాలి 

అమావాస్య తర్వాత పున్నమని నమ్మాలి

నాకు ఒక మొండితనముంది 

చీకటి ముసిరిన చోట మంటలు వేస్తాను !