వింబుల్డన్ ఎవరిదో ?
సిన్నర్, జ్వెరెవ్ మధ్య ఫైనల్ పోరు
లండన్, జూలై 11 : ప్రతిష్టాత్మక వింబుల్డ న్ 2026 క్లుమైక్స్‌కు చేరింది. పురుషుల సిం గిల్స్ ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ జానిక్ సిన్నర్, జర్మనీ స్టార్ అలెగ్జాండర్ జ్వెరెవ్ తలపడనున్నారు. ఆదివారం లండన్ సెంటర్ కోర్టులో జరిగే ఈ గ్రాండ్ ఫైనల్ కోసం టెన్నిస్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. టాప్ సీడ్‌గా బరిలోకి దిగి న ఇటలీ స్టార్ సిన్నర్ సెమీస్‌లో జకోవిచ్‌ను ఓడించి ఫైనల్‌కు దూసుకొచ్చాడు. తన సూ పర్ ఫామ్ కొనసాగిస్తున్న సిన్నర్ వరుసగా రెండో ఏడాది వింబుల్డన్ టైటిల్‌పై కన్నేశా డు. మరోవైపు టోర్నీలో 3వ సీడ్‌గా ఆడుతున్న జ్వెరెవ్ సెమీస్‌లో ఆర్థర్ ఫెరీని వరుస సెట్లలో ఓడించాడు. వింబుల్డన్ ఫైనల్‌కు చే రడం జ్వెరెవ్‌కు ఇదే తొలిసారి.
ఈ మ్యాచ్‌లో సిన్నర్‌ను ఫేవరెట్‌గా చెబుతున్నారు. జ్వెరెవ్‌తో జరిగిన గత 9 మ్యాచ్‌లలో అతనిదే పై చేయిగా నిలిచింది. గ్రౌండ్ స్ట్రోక్స్, పవర్‌ఫుల్ షాట్లతో ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచడంలో సిన్నర్‌కు పేరుంది. మరోవైపు తొలిసారి వింబుల్డన్ ఫైనల్ చేరిన జ్వెరెవ్‌ను సైతం తక్కువ అంచనా వేసేందుకు వీలులేదు. బలమైన సర్వీసులు జ్వెరెవ్‌కు ప్రధాన ఆయుధంగా చెప్పొచ్చు. ఇటీవలే ఫ్రెండ్ ఓపెన్ గెలిచి ఫామ్‌లో ఉన్నాడు. అయితే సిన్నర్ పవర్‌గేమ్‌ను అతను ఎలా ఎదుర్కొంటాడనేది ఆస క్తికరంగా మారింది. గ్రాస్ కోర్టుపై వీరిద్దరూ తలపడనుండడం ఇదే తొలిసారి. జ్వెరెవ్ తన సర్వీస్ బలంతో దూసుడుగా ఆడితే మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశముందని అంచనా వేస్తున్నారు.






