12 July, 2026 | 2:22 AM

వింబుల్డన్ రాణి నొస్కో వా

12-07-2026 12:58 AM
  1. ఫైనల్లో ముచోవాపై విజయం
  2. 21 ఏళ్లకే టైటిల్ గెలిచిన ప్లేయర్‌గా రికార్డ్

లండన్, జూలై 11 : ప్రతిష్టాత్మక వింబుల్డన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను చెక్ రిపబ్లిక్ టెన్నిస్ స్టార్ లిండా నొస్కోవా కైవ సం చేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో ఆమె తన దేశానికే చెందిన కరోలినా ముచోవాను 6 5- 6- తేడాతో ఓడించింది. తొలి సెట్ గెలుచుకున్న నొస్కోవా రెండో సెట్‌లో నూ ఆధిక్యంలో నిలిచింది. అయితే అనూహ్యంగా పుంజుకున్న ముచోవా స్కోరు సమం చేసింది. డిసైడింగ్ సెట్ లో మరోసారి అదరగొట్టిన నొస్కోవా పైచేయి సాధించి ఛాంపియన్‌గా నిలిచింది.

నొస్కోవా 21 ఏళ్ల వయస్సులోనే ఈ ఘనత సాధించి, 2011లో పెట్రా క్విటోవా తర్వాత అత్యంత పిన్న వయస్కురాలైన విం బుల్డన్ ఛాంపియన్‌గా చరిత్ర సృష్టించింది. ఓపెన్ ఎరాలో చెక్ రిపబ్లిక్ దేశానికి చెందిన ఇద్దరు క్రీడాకారిణులు గ్రాండ్స్లామ్ ఫైనల్లో తలపడటం ఇదే తొలిసారి.వింబుల్డన్ విజ యం తర్వాత ఆమె తన కెరీర్ బెస్ట్ ర్యాంక్ 7వ స్థానానికి చేరుకోనుంది. నొస్కోవాకు ఇదే తొలి గ్రాండ్‌శ్లామ్ టైటిల్. 2026 సీజన్‌లో బెర్లిన్ ఓపెన్ టైటిల్‌ను గెలుచుకుంది.