calender_icon.png 9 May, 2025 | 6:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మార్కులు ఎందుకు తగ్గాయి?

21-03-2025 12:00:00 AM

టీజీపీఎస్సీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన గ్రూప్ పరీక్షా ఫలితాల్లో మార్కులు తగ్గాయని చాలామంది అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క మార్కు తక్కువ రావడం వల్ల ప్రభుత్వ ఉద్యోగానికి దూరమయ్యే ప్రమాదం ఉంటుంది.

అప్పుడు ఆ మానసిక క్షోభ వర్ణనాతీతం. ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి నోటిఫికేషన్ల కోసం ఏండ్ల తరబడి వేచి చూసిన తర్వాత తీరా ప్రకటన వచ్చి ఎటువంటి వాయిదాలు, కోర్టు కేసులు లేకుండా పరీక్షలు జరిపినా, తుది ఫలితాలు వచ్చేసరికి యువత తమ విలువైన ఎంతో సమయాన్ని కోల్పోతున్నది. యూపీఎస్సీ మాదిరి జాబ్ క్యాలెండర్ ప్రకారం నియామకాలు టీజీపీఎస్‌సీలోనూ జరిగితే బావుంటుందని అందరూ ఆశిస్తున్నారు.

అప్పుడు తెలంగాణ నిరుద్యోగ యువతకు ఇన్ని ఇబ్బందులు ఉండవు. ప్రకటనల నుంచి పరీక్షల నిర్వహణ, ఫలితాల విడుదల, నియామకాల వరకూ టీజీపీఎస్‌సీ కూడా యూపీఎస్సీలాగా వ్యవహరించగలిగితే నిరుద్యోగ యువతకు ఎంతో మేలు జరుగుతుంది. గ్రూప్ విషయానికి వస్తే 2022లో వచ్చిన నోటిఫికేషన్ పలుమార్లు వాయిదా పడుతూ, 2024 డిసెంబర్‌లో విడుదలైంది.

టీజీపీఎస్సీ విడుదల చేసిన గ్రూప్ ప్రిలిమినరీ చూసుకున్న అభ్యర్థులకు నాలుగు పేపర్లలో కలిపి వచ్చిన మార్కులకు, ఫైనల్ తర్వాత వచ్చిన మార్కులకు చాలా వ్యత్యాసం కనిపించింది. నాలుగు పేపర్లలో కలిపి దాదాపు 20 ప్రశ్నల్లో కొన్ని సమాధానాలు డిలీట్ అయితే మరికొన్నింటికి ఆప్షన్లు మారాయి. 

ఒక్క మార్కుతో ఉద్యోగం కోల్పోయే ప్రమాదం ఉన్న సందర్భంలో ప్రిలిమినరీ నుండి ఫైనల్ వచ్చేసరికి దాదాపు 20 ప్రశ్నలకు సమాధానాలు మారితే ఎలా? అవి చాలామంది జీవితాలను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది కదా? గ్రూప్ ఫైనల్ కూడా దాదాపు 14 ప్రశ్నలకు సమాధానాలు మారాయి. గ్రూప్ నాలుగో పేపర్ తెలంగాణ ఉద్యమం - రాష్ట్ర ఆవిర్భావం నుంచే దాదాపు పదికి పైగా ప్రశ్నలకి సమాధానాలు మారాయి.

కాబట్టి, రాబోయే నోటిఫికేషన్ల సందర్భం లోనైనా ఇటువంటి తప్పిదాలు జరగకుండా చూసుకోవాలని అభ్యర్థులు కోరుతున్నారు. టీజీపీఎస్సీ దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే, నిరుద్యోగ యువత జాబ్ క్యాలెండర్ కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం త్వరగా జాబ్ క్యాలెండరును విడుదల చేయాలి. అప్పుడు యువత ఆత్మస్థయి ర్యాన్ని కూడగట్టుకొని పరీక్షలకు సన్నద్ధమయ్యే అవకాశం ఉం టుంది. ఆ దిశగా ప్రజా ప్రభుత్వం, టీజీపీఎస్సీ అడుగులు వేస్తుందని ఆశిద్దాం.

 డా. ఎ.వెంకట్రామ్‌రెడ్డి, హైదరాబాద్