calender_icon.png 9 May, 2025 | 1:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అణువిద్యుత్తు లక్ష్యం నెరవేరేనా?

21-03-2025 12:00:00 AM

వచ్చే 2032 నాటికి భారతదేశం 63 గిగావాట్ల అణువిద్యుత్ సామర్థ్యాన్ని చేరుకోవాలనే లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్దే శించింది. అయితే, దేశంలోని పౌర, ప్రజాహక్కుల సంఘాలు ‘అవి నెలకొల్పే ప్రాం త ప్రజల్లో భయం సష్టించి వ్యతిరేక ఉద్యమాలు చేస్తూ ఈ లక్ష్యం నెరవేర్చే అవకా శం కల్పిస్తాయా’ అనేది పెద్ద అనుమానమే.

2011లో జపాన్‌లోని ఫుకుషిమా అ ణువిపత్తు ప్రమాదం తర్వాత కేంద్రం ప్రతిపాదిత అణువిద్యుత్ ప్లాంట్‌ల నిర్మాణ ప్రదేశాలలోని ప్రజలతో కలసివారు అనేక అణువిద్యుత్ నిర్మాణాలకు వ్యతిరేక నిరసనలు జరపటమే ఈ అనుమానానికి తావి స్తోంది. గతంలోనే మహారాష్ర్టలోని జైతాపూర్ అణువిద్యుత్ ప్రాజెక్టు, తమిళనా డులోని కుడంకుళం అణువిద్యుత్ ప్లాం ట్‌కు వ్యతిరేకంగా సామూహిక నిరసనలు జరిగాయి.

హరిపూర్ సమీపంలో ప్రతిపాదిత పెద్ద అణువిద్యుత్ ప్లాంట్‌కు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. పైగా ప్రభుత్వ పౌర అణు కార్యక్ర మానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యమూ దాఖలు చేయటం తో లక్ష్యం వెనుకబడిందని చెప్పాలి.

మన దేశంలో అణుశక్తి చరిత్ర విషయానికి వస్తే మార్చి 1946లో ‘కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్’ కిం ద ఉన్న ‘బోర్డ్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్’ భారతదేశ అణుశక్తి వన రులను అన్వేషించడానికి, వాటిని అభివృ ద్ధి చేయడానికి, ఉపయోగించుకోవడానికి మార్గాలను సూచించడానికి, ఇతర దేశాలలోని సారూప్యసంస్థలతో సంబంధాలను ఏర్పరచుకోవడానికి భాభా నాయకత్వం లో ఒక అణు పరిశోధన కమిటీని ఏర్పా టు చేశారు.

ఆ తర్వాత వివిధ అంశాలను, యురేనియం, థోరియం తదితర మూల పదార్థాల పరిశోధనలు, మూలకాల లభ్యతలపై అనేక చర్చలు జరిగి ఎట్టకేలకు భారత్ అణువిద్యుత్ ఉత్పత్తి కోసం అనువైందిగా నిర్ణయానికి వచ్చారు. 

1956లోనే ‘అప్సర ’ప్రారంభం

ఈ మేరకు భారతదేశంలో తొలి న్యూక్లియర్ రియాక్టర్ 1956లో తారాపూర్ వద్ద నిర్మితమైంది. దీనికి ‘అప్సర’ అని అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ నామకర ణం చేశారు. ఇది మన దేశంలోనేకాక యా వత్ ఆసియా దేశాల్లోనే తొలి రియాక్టర్ కావడం విశేషం. ‘అప్సర’ అనేక సంవత్సరాలపాటు అణు ఉత్పత్తి సేవలందించింది. అయితే, దానికి కొన్ని మరమ్మతులు చే సేందుకు ఈ రియాక్టరును 2000లో మూసేశారు.

మరమ్మతులు అయ్యాక తిరి గి 2018లో రెండోసారి దీని ఉత్పత్తి సామర్థ్యాన్ని ఒక మెగావాట్ నుండి రెండు మెగా వాట్లకు పెంచి అందుబాటులోకి తెచ్చా రు. అప్పటివరకు అణువిద్యుత్‌ను అత్యం త ప్రమాదకరంగా భావిస్తున్న తరుణంలో భారతదేశంలో దీనికి ఆద్యుడైన హోమీ జహంగీర్ భాభా 1954లోనే అటామిక్ ఎనర్జీ ఎస్టాబ్లిష్‌మెంట్‌ని ట్రాంబేలో స్థా పించారు.

ఆయన అంతటితో ఆగకుండా భారతదేశంలో అణుశక్తి రంగంలో పరిశోధనను మరింతగా ప్రోత్సహించేందుకు దే శవ్యాప్తంగా అణు రియాక్టర్ల రూపకల్పన, అభివృద్ధిపై పనిచేస్తున్న ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు ఈ కేంద్రంలో పనిచేయడానికి రావాలని పిలుపు నిచ్చారు. 

ఈ మేరకు 1955 మార్చి 15న మన దేశంలో మొదటి అణు పరిశోధన రియాక్టర్ నిర్మించాలని నిర్ణయించారు. ఈ మొ త్తం కార్యక్రమానికి డాక్టర్ భాభా అధిపతిగా ఉన్నారు. ఈ రియాక్టర్ ఒక స్విమ్మిం గ్ పూల్ మాదిరిగా, ఒక మెగావాట్ సామర్థ్యాన్ని కలిగి ఉండాలని తొలుత నిర్ణయించారు.

పరిశోధనా రియాక్టర్ నిర్మాణ పను లు భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (బా ర్క్) ప్రాంగణంలో ప్రారంభమయ్యాయి. దీని రియాక్టర్ కోసం యురేనియంను సరఫరా చేయడానికి బ్రిటన్ -భారతదేశం మ ధ్య ఒప్పందం కుదిరింది. 

ఏడు రాష్ట్రాల్లో అణుకేంద్రాలు

దేశవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలందరూ కేవలం 15 నెలల్లోనే రియాక్టర్ పనిని పూ ర్తి చేయడానికి పగలు, రాత్రి కష్టపడ్డారు. చివరకు ఇది విజయవంతంగా 1956 నుండి సేవలందించడం ప్రారంభించింది. భారతదేశంతోపాటు మొత్తం ఆసియాలో ఇది మొదటి అణురియాక్టర్. దీనికి కావలసిన ఇంధనమూ మన దేశంలోనే తయా రైంది.

దాంతో ఈ రియాక్టర్ సామర్థ్యాన్ని తిరిగి పెంచేందుకు 2009లో మూసేసి తిరిగి 2018 సెప్టెంబర్ 10న ఎంతో సాంకేతిక నైపుణ్యంతో పునఃప్రారంభించారు.  అణువిద్యుత్ కేంద్రాలు 2022 నాటికి ప్ర పంచవ్యాప్తంగా 32 దేశాల్లో స్థాపితమైనాయి. భారతదేశంలో థర్మల్, జలవిద్యు త్, పునరుత్పాదక విద్యుత్ వనరుల తర్వా త అణుశక్తి ఐదవ అతిపెద్ద విద్యుత్ సరఫరా చేయగలిగే సత్తా గలిగినవిగా ఈ కేం ద్రాలను పేర్కొనాలి.

ప్రస్తుతం భారతదేశంలో 6,780 మెగావాట్ల విద్యుత్ సరఫ రా చేయగలిగే సామర్థ్యంతో 7 రాష్ట్రాల్లో 22 అణుశక్తి రియాక్టర్లు ఉన్నాయి. వీటిలో 18 రియాక్టర్లు ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్లు కాగా, మిగిలిన 4 లైట్ వాటర్ రియాక్టర్లు. ముంబైలోని న్యూక్లియర్ పవ ర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ప్రభుత్వరంగ సంస్థ దేశంలో అణుశక్తిద్వా రా విద్యుదుత్పత్తికి బాధ్యత వహిస్తుంది. 

భయాందోళనలకు కారణం

మన దేశంలో 2032 నాటికి 55 రి యాక్టర్ల ద్వారా 63 వేల గిగావాట్ల విద్యుదుత్పత్తి లక్ష్యంగా నిర్దేశించుకున్న భారత ప్రభుత్వం ఇండో, యుఎస్ న్యూక్లియర్ ఒ ప్పందం అమలులో ఎన్నో అవరోధాలు, అనుమానాలు, ఆంక్షలు ఎదుర్కోవలసి వస్తున్నది. కారణం 2011 మార్చిలో జపాన్‌లోని పుకుషిమా అణువిద్యుత్ కేంద్రం లో జరిగిన పెను ప్రమాదం.

దీంతో ప్రపంచంలో అణు విద్యుదుత్పత్తి చేస్తున్న దేశా ల్లోని ప్రజల్లో భయాందోళనలు రేకెత్తుతున్నాయి. కాగా, ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ అవసరాలలో కేవలం 11 శాతం మాత్రమే అణువిద్యుత్ కేంద్రాలు తీర్చగలుగుతున్నాయి. 

మన దేశంలో 1987లో ఏర్పా టై న న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇం డియా ఎన్నో అవరోధాలు, ఆంక్షలు, అడ్డుగోడలు, పరిమితులు, అనుమానాలు ఎ దురైనా అణువిద్యుత్ రంగంలో ఏ మా త్రం వెనుకడుగు వేయలేదనే చెప్పాలి.

అ ణువిద్యుత్ ఉత్పత్తిలో ప్రపంచంలోనే 12వ స్థానంలో ఉన్న మన దేశం తారాపూర్, న రోవా, రావత్‌భటా, కక్రాపర్, కైగా, కల్ప క్కం, కుడంకుళం ప్రధాన అణువిద్యు త్ కేంద్రాలద్వారా 6,780 మెగావాట్లు (1.89 శాతం) అణువిద్యుదుత్పత్తి సామర్థ్యంతో నిరవధికంగా పనిచేస్తున్నాయి. అదనంగా మరో 6,700 మెగావాట్లు సాధించే ప్రణాళికలు చురుకుగా సాగుతున్నాయి. 

ఆంధ్రప్రదేశ్‌లోని తీరప్రాంతం శ్రీకాకు ళం జిల్లా కొవ్వాడవద్ద తొలిదశలోని రెం డు అణు రియాక్టర్లకయ్యే వ్యయం అంచ నా భారీగా రూ.48,320 కోట్లు అయ్యే ప రిస్థితి వచ్చింది. శ్రీకాకుళం జిల్లా తీరప్రాంతంలోని రణస్థలం మండలం కొవ్వాడ -అన్నవరం గ్రామాలవద్ద  నెలకొల్పనున్న ఈ భారీ ప్రాజెక్టు 6,600 మె.వా. విద్యుదుత్పత్తి సామర్థ్యం కలిగింది.

దీనివల్ల ఆయా ప్రాంతాల్లోని  సుమారు 10 వేల జనాభా తరలి వెళ్ళాల్సి ఉంటుందని సర్వే లు తెలుపుతున్నాయి. 1963లో న్యూక్లియ ర్ పవర్ ప్లాంట్స్ నిర్మాణంపై ప్రభుత్వం నియమించిన వర్లేకర్ కమిటీ సూచనలకు అనుగుణంగానే ప్రభుత్వం మాత్రం దీని నిర్మాణ పనులు చేపట్టింది. ఇది పూర్తయి తే మన దేశం అణువిద్యుత్ ఉత్పత్తిలో ప్ర పంచంలోనే రెండు మూడు స్థానాలకు చేరే అవకాశం లేకపోలేదు. 

వ్యాసకర్త సెల్: 94915 45699