బోల్డ్ సీన్స్ రూల్స్ మాకే ఎందుకో!?
బాలీవుడ్ యంగ్ బ్యూటీ త్రిప్తి డిమ్రి ‘యానిమల్’తో హిట్ అందుకుంది. దీంతో ఈ అమ్మడు పెరిగిన క్రేజ్ మామూలుగా లేదు. ఆ సినిమాలో రణ్‌బీర్ కపూర్ ప్రియురాలు జోయాగా నటించిన త్రిప్తి తన అందచందాలతో, బోల్డ్ సీన్లలో నటించడమే అంతటి క్రేజ్‌కు కారణం. అదే స్థాయిలో విమర్శలనూ ఎదుర్కొందీ భామ. అయినా అవన్నీ పట్టించుకోని త్రిప్తి.. తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగుతోంది. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘స్పిరిట్’లో నటిస్తోంది.
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో యానిమల్ కాంబోపై ఇటీవల చర్చ జరుగుతోంది. తాజాగా ఓ ఇంటర్వూలో పాల్గొన్న త్రిప్తి ‘యానిమల్’ సమయంలో వచ్చిన విమర్శలను ఖండిస్తూనే, షాకింగ్ కామెంట్స్ చేసింది. “మహిళలను సమాజంలో ఎలాగైనా జడ్జ్ చేస్తారు. నువ్వు ఏం చేసినా సరే, జనం ఏదో ఒకటి అంటూనే ఉంటారు. నువ్వు చేసే పని వల్ల సగం మంది సంతోషపడితే, ఇంకో సగం మంది నీపై కోపంగా ఉంటారు.
ఇది ఇలా సాగుతూనే ఉంటుంది. దీని గురించి మనం చేయగలి గిందేమీ లేదు. అందుకే మనం ఏ పనిచేసినా సరే.. పూర్తి నిజాయితీతో చేయాలి. నేను చేసే ప్రతి పనిలో నా 200 శాతం కష్టాన్ని పెడతాను. సినిమాల్లో ఒక స్టార్ హీరో బోల్డ్ క్యారెక్టర్‌లో నటించినప్పుడు, ఇంటిమేట్ సీన్స్‌లో పాల్గొన్న ప్పుడు ప్రేక్షకులు చప్పట్లు కొడతారు. కానీ, ఒక మహిళా నటి అదే పని చేస్తే ఎందుకంత ఈజీగా జడ్జ్ చేస్తారు. మరి బోల్డ్ సీన్స్ చేయడంలో మగవారికి లేని రూల్స్ మాకెందుకో నాకు అర్థం కాదు.
అందుకే ఎవరేమన్నా మన గురించి మనం చూసుకోవాలి.. మాట్లాడేవాళ్లు మాట్లాడుకుంటూనే ఉంటారు. ఎందుకంటే నేను ఏ ఉద్దేశంతో ఆ పని చేశానో అవతలి వాళ్లకు తెలియదు కదా! కొన్ని రోజులు ఈ అనవసరపు మాటలను మనం పట్టించుకోకుండా వదిలేయగలం, కానీ కొన్ని రోజులు అవి మనల్ని బాగా కుంగదీస్తాయి. ఇదంతా జీవితంలో ఎదిగే క్రమంలో ఒక భాగమే. ఆ మాటలు నన్ను కొంచెం బాధించినా.. నేను ఆ పెయిన్‌ను నా యాక్టింగ్‌లో చూపిస్తా” అంటూ భావోద్వేగంతో తెలిపింది త్రిప్తి.






