6 June, 2026 | 1:44 AM

థియేటర్లు ఇవ్వకపోతే ఆత్మహత్యే శరణ్యం

06-06-2026 12:00 AM

తెలుగు సినిమా పరిశ్రమలో మాఫియా చిన్న సినిమాలను చంపేస్తోందని ‘ఓ అందాల రాక్షసి’ హీరో, మూవీ మేకర్ షెరాజ్ మెహదీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రిలీజ్‌కే కాదు, రీ-రిలీజ్‌కు కూడా థియేటర్లు ఇవ్వలేదని లేదని, థియేటర్స్ ఇవ్వకపోతే ఆత్మహత్యే శరణ్యం తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తెలుగు ఫిలిం చాంబర్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు. “మంచి సినిమాలను చంపేస్తున్నారు. చిన్న సినిమాలను చంపేస్తున్నారు.

నైజాం ఏరియాలో ఒక్క థియేటర్ కూడా ఇవ్వలేదు. ఇది ఉద్దేశపూర్వకంగా జరుగుతోంది. ఈ విషయంపై లీగల్‌గా పోరాటం కొనసాగుతుంది. చిన్న సినిమాల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. ప్రపంచంలో ఎక్కడా లేని పరిస్థితి మన ఇండస్ట్రీలో ఉంది. బాలీవుడ్‌లో కూడా ఇలా ఉండదు.

చిన్న సినిమాలకు థియేటర్లు, సరైన అవకాశాలు కల్పించకపోతే కొత్త ప్రతిభ ఎదగడం కష్టమవుతుంది. చిన్న సినిమాలను కాపాడాలి. పరిశ్రమలో సమాన అవకాశాలు కల్పించాలి. సెన్సార్ బోర్డు నిబంధనలు చిన్న సినిమాలకు భారంగా మారుతున్నాయి. ఏడీసీసీ వంటి చార్జీలు కూడా నిర్మాతలను కుంగదీస్తున్నాయి” అని షెరాజ్ మెహదీ ఆవేదన వ్యక్తం చేశారు.