9 June, 2026 | 2:33 AM

మా బతుకులతో ఆడుకుంటే నేనెందుకు వదులుతా..

09-06-2026 01:12 AM

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న యాక్షన్-డ్రామా ‘స్లమ్ డాగ్’. ‘33 టెంపుల్ రోడ్’ అనేది ట్యాగ్‌లైన్. ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్, జేబీ మోషన్ పిక్చర్స్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, జేబీ నారాయణరావు కొండ్రోల్లా నిర్మిస్తున్నారు. ఇందులో విజయ్ సేతుపతికి జోడీగా సంయుక్త నటిస్తుండగా, టబు, కన్నడ స్టార్ దునియా విజయ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. బ్రహ్మాజీ, వీటీవీ గణేశ్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

ఈ బహుభాషా చిత్రం చిత్రీకరణ కార్యక్రమాలు ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ మూవీ టీజర్ సోమవారం విడుదలైంది. “ఒక్క వాన పడితే కాకుల్లా చెట్ల కింద దాక్కొనే జీవితాలు మావి. అలాంటి మా బతుకులతో ఆడుకుంటే నేనెందుకు వదు లుతా” అంటూ హీరో ఇచ్చే ఎంట్రీ, యాక్షన్, నేపథ్య సంగీతం అలరించే లా ఉన్నాయి. టీజర్‌లో పూరి మార్క్ స్పష్టంగా కనిపిస్తోంది. ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.