ఎయిడ్స్ వ్యాధి నిర్మూలనకు ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలి
సూర్యాపేట, ఏప్రిల్ 9 (విజయక్రాంతి) : ఎయిడ్స్ వ్యాధి నిర్మూలనకు ప్రజలలో విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. గురువారం ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఆరోగ్యవారంలో 4వ రోజు ఎయిడ్స్ వ్యా ధి నిర్మూలనపై అవగాహన కల్పించేందుకు రెడ్ రన్ ను ప్రభుత్వ జూనియర్ కళాశాల, వద్ద జెండా ఊపి ప్రారంభించారు.
తదుపరి ఆయన మాట్లాడుతూఎయిడ్స్ పై సరైన అవగాహన కల్పించి వ్యాధి వ్యాప్తి విధానాలైన రక్త మార్పిడి, సూదులు/సిరంజీలు, తల్లి నుండి పిల్లకు సోకకుండా గర్భిణీలు తప్పనిసరిగా హెచ్‌ఐవి పరీక్షలు చేసుకోవాలన్నారు. ఈ విషయాల గురించి అన్ని శాఖల వారు విస్తృతముగా అవగాహన కల్పించి వ్యాధి వ్యాప్తి నివారించాలని సూచించారు. తదుపరి జిల్లా వైద్య , ఆరోగ్య శాఖాధికారి డా,,పెండెం వెంకట రమణ మాట్లాడుతూ ఎయిడ్స్ అంటూ వ్యాధికాకున్నా, అంటించుకునే వ్యాధి అని అసురక్షిత లైంగిక సంబంధాల వలన సంక్రమించే అవకాశం వున్నదన్నారు.
తగు జాగ్రత్తలతో వ్యాధిని అరికట్టవచ్చు అన్నారు. ఈ కారక్రమoలో మున్సిపల్ చైర్ పర్సన్ మొరిశెట్టి నివేదిత, వైస్ చైర్మన్గా ఎండి షఫీ ఉల్లా, జిల్లా సంక్షేమ అధికారి నర్సింహారావు, మున్సిపల్ కమీషనర్ హనుమంతరెడ్డి, డిప్యూటీ డిఎంహెచ్వో డా,,చంద్ర శేఖర్, ప్రోగ్రాం అధికారులు డాక్టర్లు నాజియా, శ్రీశైలం, శ్రావణి, మెడికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




